ప్లాపుల్లో ఉన్నా.. రవితేజ మార్కెట్ ఏమాత్రం తగ్గట్లేదుగా..!

ఒకప్పుడు రవితేజ సినిమా అంటే…. బయ్యర్స్ కొన్నదానికి 10 శాతం వరకూ లాభాలు వచ్చేవి.. ఇది ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రమే…! అదే హిట్ టాక్ వస్తే అది 25 శాతం పైనే ఉండేది. అందుకే రవితేజ ను మినిమం గ్యారంటీ హీరో అనే వారు. తక్కువ బడ్జెట్ లో సినిమాని తీయడం… దానికి తగినట్టు బిజినెస్ చేసుకోవడం… అలా రవితేజ నిర్మాతల హీరోగా కొన్నాళ్ళు కొనసాగాడు. అయితే తరువాత హిట్లు పడటం… మార్కెట్ పెరగడంతో రెమ్యూనరేషన్ పెంచేసాడు. తప్పులేదు కానీ… సినిమా మేకింగ్ విషయంలో కూడా రవితేజ మార్కెట్ ను బట్టి బడ్జెట్ పెంచేసేవారు నిర్మాతలు.

దీంతో బిజినెస్ అనుకున్న స్థాయిలో అవ్వకపోవడం వంటివి జరిగాయి. ఫలితంగా ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ చిత్రాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రవితేజ పాత పద్దతికి వచ్చేసాడు. రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడు… తక్కువ బడ్జెట్ లో సినిమాని ఫినిష్ చేయమని నిర్మాతలకి ఒకటికి రెండు సార్లు చెబుతున్నాడు. ఇప్పుడు తన తరువాతి చిత్రం ‘క్రాక్’ విషయంలో ఇదే ఫార్ములా అప్లై చేసాడు. ‘ఠాగూర్’ మధు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. శివరాత్రి రోజున టీజర్ విడుదల చేశారు. మే 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించేసారు. అంతేకాదు ఈ చిత్రానికి తెలుగురాష్ట్రాల్లో బిజినెస్ కూడా పూర్తయిపోయిందట. ట్రేడ్ వర్గాల నుండీ అందిన సమాచారం మేరకు

నైజాం – 6.30 కోట్లు
సీడెడ్ – 3.33 కోట్లు
ఆంధ్ర(టోటల్) – 8.50 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ : 18.13 కోట్లు
————————————————-

ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లెక్కలు తెలియాల్సి ఉంది. అవి తక్కువలో తక్కువ 2 కోట్లు అనుకున్నా… 20 కోట్ల పైనే ఈ చిత్రం బిజినెస్ చేసినట్టు లెక్క. రవితేజ గత నాలుగు సినిమాలు కనీసం 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయినా ‘క్రాక్’ చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో ‘డాన్ శీను’ ‘బలుపు’ వంటి సూపర్ హిట్లు కొట్టాడు రవితేజ. ఆ చిత్రాలు నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాల్ని అందించాయి. బహుశా అదే నమ్మకంతో ఇంత పెద్ద మొత్తం పెట్టి ‘క్రాక్’ ను కొనుగోలు చేస్తున్నారేమో..!

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus