రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. “జింకల్ని వేటాడే పులిని చూసి ఉంటావ్.. పులిని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా” అనే డైలాగ్ తో ఉన్న ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రావణాసుర సినిమాతో రవితేజ ఖాతాలో ఫ్లాప్ చేరగా టైగర్ నాగేశ్వరరావు మూవీ మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి భారీ మొత్తంలో ఖర్చు చేసి ఈ సినిమాను నిర్మించామని ఆయన తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ నిర్మిస్తున్న సమయంలో కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయని అభిషేక్ అగర్వాల్ అన్నారు.
అన్నీ తట్టుకుని ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ కోసం రైలు సెట్ తో పాటు గోదావరి రైల్వే బ్రిడ్జి సెట్ వేశామని దర్శకుడు వంశీ చెప్పుకొచ్చారు. సినిమాకు ఎన్ని డబ్బులు వస్తాయో చెప్పలేం కానీ ఫ్యాన్స్ ఆకలి మాత్రం కచ్చితంగా తీరుతుందని మేకర్స్ వెల్లడించడం గమనార్హం. సినిమాలో రవితేజ కనిపించరని ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం. (Ravi Teja) రవితేజ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని తెలుస్తోంది. నపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది దసరా కానుకగా బాలయ్య అనిల్ కాంబో మూవీ, రామ్ బోయపాటి కాంబో మూవీ రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు