బిగ్ బాస్ హౌస్ లో నియంత మాటే శాసనం అనే టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు అందరూ కూడా సిన్సియర్ గా గేమ్ ఆడుతున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు చివరకి రవి, సిరి, షణ్ముక్ ఇంకా ప్రియాంకలు మాత్రమే మిగిలారు. ఇక్కడే ఫస్ట్ ఛాలెంజస్ ఆడిన తర్వాత ప్రియాంక సిరి ఇద్దరూ రేస్ నుంచీ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన రవికి ఇంకా షణ్ముక్ కి ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా కెప్టెన్ అయ్యే అవకాశం లభిస్తుంది.
ఇందులో భాగంగానే షణ్ముక్ ని ఇంటి సభ్యులు అందరూ కలిసి ఎంచుకున్నారట. ఇక్కడే శ్రీరామ్ ఒకే ఒక్కడు మాత్రమే రవి సైడ్ నిలబడ్డాడడని, మిగతా ఇంటి సభ్యులు అయిన సిరి, మానస్, ప్రియాంక, సన్నీ , కాజల్ ఓట్లు షణ్ముక్ కిి పడ్డాయని తెలుస్తోంది. నిజానికి ఈ విషయాన్ని సన్నీ ముందే చెప్పాడు. చివర్లో ఇంటి సభ్యుల వల్లే కదా ఓటింగ్ వచ్చి కెప్టెన్ అవ్వాలి అప్పుడు చెప్దాం అంటూ మాట్లాడాడు. అనుకున్నట్లుగానే రవికి చెక్ పెట్టారు ఇంటి సభ్యులు.
అయితే, ఇక్కడ శ్రీరామ్ మాత్రం రవిని సపోర్ట్ చేస్తూ డిఫరెంట్ గేమర్ గా మారాడు. దీంతో షణ్ముక్ 13వ వారం ఇంటి కెప్టెన్ గా అయి తదుపరి వారానికి ఇమ్యూనిటీని సాధించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ట్రైన్ టాస్క్ అనేది నడుస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబసభ్యులు కలిసినట్లుగా తెలుస్తోంది. లాస్ట్ సీజన్ లో లాగా గ్లాస్ డోర్ లో కాకుండా వాళ్లని నేరుగా హౌస్ లోకి పంపిచినట్లుగా సమాచారం. ఈ ఎపిసోడ్ లో టీఆర్పీ కోసం ఎమోషన్స్ ని పండించబోతున్నాడు బిగ్ బాస్.