Ram Charan, Shankar: ఆ డీల్ తో నిర్మాత దిల్ రాజుకు టెన్షన్ తీరిందా?

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం దిల్ రాజు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా శాటిలైట్ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి దిల్ రాజు విక్రయించారని సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటించేలా చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శంకర్ చరణ్ సినిమాతో ఫామ్ లోకి రావాలని భావిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. జీ స్టూడియోస్ చరణ్ శంకర్ కాంబో మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులను 350 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఈ డీల్ కు సంబంధించి మేకర్స్ స్పష్టత ఇస్తే మాత్రమే నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.

వచ్చే ఏడాది రిలీజ్ చేయడం సాధ్యం కాకపోతే 2023 సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా రిలీజవుతుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమా సక్సెస్ సాధిస్తే భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా సినిమాలను నిర్మించే ఛాన్స్ ఉంది. చరణ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus