కుటుంబ సభ్యుల టార్చర్ వల్లే నటి చనిపోయిందా..?

తమిళ బుల్లితెర నటి చిత్ర ఇటీవల చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక ఆధారాలు మాయం అయ్యాయని సమాచారం. చిత్రది ఆత్మహత్య కాదు.. హత్యే అనే అనుమానాలు ఉన్నాయి. ఆమె సూసైడ్ చేసుకునేలా కుటుంబ సభ్యులే ఉసిగొల్పారనే వాదన వినిపిస్తోంది. ఈ కేసులో కీలక ఆధారాలను కూడా మాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విషయమై నాలుగో రోజు విచారణ చేపట్టిన పోలీసులకు కొన్ని నిజాలు తెలిశాయి. చిత్ర సెల్ ఫోన్ లో ముఖ్యమైన ఫోటోలు, ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెసేజ్ లు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు.

వీటిని మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిత్ర సూసైడ్ కి సెల్ ఫోన్ లోని మెసేజ్ లు, ఫోటోలతో సంబంధం ఉండడం వలనే వాటిని డిలీట్ చేసి ఉంటారని.. అది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చిత్ర ఆత్మహత్యకి ఆమె భర్త, తల్లి నుండి ఎదురైన ఒత్తిళ్లే కారణమని చెబుతున్నారు. నిజానికి హేమనాథ్ తో జనవరిలో చిత్ర పెళ్లి జరగాల్సి వుంది. అయితే అంతకుముందే సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

ఈ విషయంలో చిత్రను ఆమె తల్లి గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. మరోపక్క షూటింగ్ లో న్నా చిత్రను సమయం, సందర్భం లేకుండా హేమనాథ్ కలుసుకునే వాడని తెలుస్తోంది. సీరియల్ నటుడితో హేమ సన్నిహితంగా మెలగడాన్ని చూసి అతను తట్టుకోలేకపోయాడని సమాచారం. దీంతో షూటింగ్ దగ్గరే ఆమెతో గొడవ పడ్డాడని సహనటులు పోలీసుల ఎంక్వయిరీలో చెప్పినట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే కుటుంసభ్యుల టార్చర్ వలనే చిత్ర సూసైడ్ చేసుకుందనే నిర్ధారణకి పోలీసులు వచ్చినట్లు సమాచారం. చిత్ర సెల్ ఫోన్ లో మాయమైన అంశాల గురించి నిజాలు రాబట్టగలిగితే కేసు మిస్టరీ వీడిపోతుందని పోలీసులు భావిస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus