రాంగోపాల్ వర్మ సినిమాలు ఇప్పుడంటే జనాలు లైట్ తీసుకుంటున్నారు కానీ అప్పట్లో తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళింది వర్మ నే అనడంలో అతిసయోక్తి లేదు. ‘శివ’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా మంది డైరెక్టర్లకు వణుకు పుట్టించాడు. మాస్ సినిమాలు తీసి సేఫ్ గేమ్ లు ఆడేసే డైరెక్టర్ లు అప్పట్లో చాలా మంది ఉండేవారు. వారి బాటలో కాకుండా వర్మ క్రియేటివ్ గా సినిమాలు తీసేవాడు. అందుకే అతని డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని చాలా మంది హీరోలు అనుకునే వారు. ఆ లిస్టులో మన మెగాస్టార్ కూడా ఉన్నారు. ఫైనల్ గా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలైంది.
అశ్వినీ దత్ గారి నిర్మాణంలో ఈ సినిమా మొదలైంది. ‘వినాలని ఉంది’ అనే పేరుని ఫైనల్ చేసి సినిమాని మొదలు పెట్టారు. టబు మెయిన్ హీరోయిన్ … ఊర్మిళ సెకండ్ హీరోయిన్. ఓ పాట కూడా యూట్యూబ్ లో ఉంది. అయితే కథ విషయంలో చిరు మార్పులు కోరాడట. అందుకు వర్మ వినీ.. విననట్టు వదిలేసే వాడట. అయినా చిరు మళ్ళీ మళ్ళీ చెప్పేవారట. ఓ రోజు షూటింగ్ కు గుడ్ బై చెప్పి ముంబై వెళ్ళిపోయాడట వర్మ. నిజానికి సంజయ్ దత్ జైల్లో ఉన్న రోజులవి. అతనితో వర్మకు సినిమా ఉంది.
కానీ అతను జైల్లో ఉన్నాడు కదా అని ఫాస్ట్ గా చిరుతో సినిమా చేసేద్దాం అని మొదలుపెట్టాడు.కానీ ప్రతీ విషయంలో చిరు ఇన్వాల్వ్ అవ్వడం … ప్రతీ దాన్ని బూతద్దంలో పెట్టి చూడటం వర్మకు నచ్చేది కాదట.ఇలా అయితే సినిమా ఫినిష్ అవ్వదు అని వర్మకు చిరాకు పుట్టేసింది. అందులోనూ వర్మ మాట పడడు.. ఒకరు చెప్పిన మాట వినడు. ఇక సంజయ్ దత్ జైలు నుండీ విడుదల అయ్యాడు అనే విషయం తెలిసాక ముంబై జంపయ్యి పోయాడు అని తెలుస్తుంది. అప్పట్లో చిరు సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. వర్మ వైఖరి వల్ల నిర్మాతలు, బయ్యర్స్ రోడ్డున పడతారు అని చిరు భావించి.. ఆ ప్రాజెక్ట్ ను లైట్ తీసుకున్నారు అని తెలుస్తుంది.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!