ఎన్టీఆర్ బయోపిక్ సినిమా హడావుడి ప్రకటనకు కారణం ఏంటో తెలుసా ?

గౌతమి పుత్ర శాతకర్ణి విజయంతో నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ మూవీ మంచి పేరుతో పాటు లాభాలను తెచ్చి పెట్టడంతో డైరక్టర్లు బాలయ్య డేట్స్ కోసం క్యూలో ఉన్నారు. బడా దర్శకులు సైతం అద్భుత కథలను వినిపించారు. ఏ స్టోరీ ఎంచుకోవాలో ఆలోచనలో ఉన్న ఆయన సడన్ గా తన తండ్రి మహా నటుడు నందమూరి తారక రామరావు జీవిత చరిత్రపై సినిమా తీస్తానని, అందులో హీరోగా తానే నటిస్తానని వెల్లడించారు. సమయం సందర్భం లేకుండా ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఈ ప్రకటన చేయడం వెనుక బలమైన కారణం ఉందని లేటెస్ట్ గా తెలిసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా తీయాలని అనుకున్నారు.

అంతేకాదు దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఆ మహానటుడుపై పరిశోధన చేయమని, స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారంట. అదే పనిలో స్టార్ డైరక్టర్ ఉండగా.. ఆ విషయం బాలకృష్ణ చెవిన పడింది. దీంతో తాను ఉండగా తారక్ సినిమా తీయడం ఏమిటని భావించి, ముందుగానే బాలయ్య ఈ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సో ఇప్పటి వరకు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై అధ్యయనం చేసిన డైరక్టర్ పూరి నే ఈ చిత్రానికి డైరక్టర్ గా తీసుకోవాలని బాలయ్య ఆలోచిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus