ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడంపై రానా స్పందన!

తెలుగు సినీ అభిమానుల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కుతోన్న సినిమాపై రోజురోజుకి ఆసక్తి పెరిగిపోతోంది. ఎన్టీఆర్ గా బాలకృష్ణ చేస్తున్న ఈ మూవీ తేజ నుంచి క్రిష్ చేతికివచ్చిన తర్వాత వేగంగా పరుగులెడుతోంది. మనదేశం సినిమాతోనే నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలయింది. అందుకే అదే గెటప్ తోనే సినిమా షూటింగ్ మొదలెట్టారు. అలాగే రీసెంట్ గా మాయాబజార్ సినిమా సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. మరికొన్ని సన్నివేశాలతో కలుపుకొని మొదటి షెడ్యూల్ ని విజయవంతమగా పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తో పాటు బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా పాల్గొంది. ఆమె ఇందులో మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

రెండో షెడ్యూల్ త్వరలోనే నిమ్మకూరులో మొదలుకానుంది. ఇందులో రానా కూడా పాల్గొననున్నారు. అతను ఇందులో చంద్రబాబునాయుడు పాత్రలో కనిపించనున్నారు.  ఆవిషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఎన్టీఆర్‌ అని పిలవబడే మహోన్నత వ్యక్తి కథను ప్రేక్షకులు అందరికీ చెప్పడానికి మేము కలిసి వస్తున్నాం’’ అని బాలకృష్ణ, క్రిష్‌తో కలిసి దిగిన ఫొటోని శుక్రవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోల‌కి ఓ నెటిజ‌న్ “సైడ్ క్యారెక్టర్లు చేయకండి రానాగారూ” అని కామెంట్ చేశాడు. అందుకు రానా స్పందిస్తూ ‘‘ఎన్టీయార్ జీవిత‌చ‌రిత్ర‌లో ఓ చిన్న పాత్ర చేయ‌డం కూడా చాలా గొప్ప‌ది’’ అంటూ చెప్పారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus