ఎంతమంది చెప్పినా దిల్ రాజు వినలేదు..ఫలితం అనుభవిస్తున్నాడు

సమంత శర్వానంద్ ల లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ జాను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. జాను మూవీ వసూళ్లకు, వచ్చిన టాక్ కి సంబంధం లేకుండా ఉంది. ఈ చిత్రానికి అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఐనప్పటీకీ మొదటి రోజు నుండే వసూళ్ల జోరు తగ్గింది. ఇంత హైప్ మధ్య విడుదలైన జాను సమంత గత చిత్రం ఓ బేబీ కి వచ్చిన ఓపెనింగ్స్ కూడా దక్కించుకులేకపోయింది. చెప్పుకోదగ్గ పోటీ ఏమి లేకపోయినా జాను వసూళ్ళలో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు. దీనితో నిర్మాతలు జాను కలెక్షన్స్ విడుదల చేయడమే మాని వేశారు. ఇక మరో రెండు రోజులలో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ విడుదల కానుంది. కాబట్టి జాను కనీసం బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కూడా కష్టమే.

క్లాసిక్స్ జోలికి వెళ్ళకూడదు అనే నానుడి జాను మూవీ ఫలితంతో మరోమారు రుజువైంది. ఈ చిత్రంలో సమంత, శర్వా నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా ఫలితం మాత్రం తమిళంలో వలే పునరావృతం కాలేదు. అలాగే తెలుగు ప్రేక్షకులకు ట్రాజెడీ ఎండింగ్స్ అసలు రుచించవు. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ చనిపోవడం, విడిపోవడం వంటి నెగెటివ్ కాన్సెప్ట్స్ తెలుగు ప్రేక్షకులు అంగీకరించరు. ఎన్ని బాధలు పడినా కథ మాత్రం సుఖాంతం అవ్వాలి. అలాగే జాను మూవీ కూడా విషాదాంతం అవుతుంది. క్లాసిక్ మూవీస్ ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తమిళంలో ఎప్పుడో చూసేశారు. ఇక చూడని వారు జాను అలాంటి చిత్రం అని చెప్పి వెళ్లడం మానేశారు. దీనితో జాను మూవీ పరిస్థితి ఇలా తయారైంది.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus