అందుకే రాజశేఖర్ వెంటనే రాజీనామా చేశారట..!

నిన్న జరిగిన ‘మా 2020 డైరీ ఆవిష్కరణ’ వేడుకలో పెద్ద రభస జరిగిన సంగతి తెలిసిందే. ” ‘మా’ లో కొన్ని మనస్పర్థలు నెలకొన్నాయని.. ఇక మీదట అలా ఉండకుండా.. అందరం కలిసి పని చెయ్యాలని.. ‘మంచి మైక్ లో చెబుదాం.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం’.. అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలని వ్యతిరేకిస్తూ రాజశేఖర్ కౌంటర్లు వేయడం.. పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ‘సినిమాల్లోనే కాదు.. బయట కూడా హీరో అనిపించుకోవాలి’ అంటూ రాజశేఖర్ కామెంట్ చేసి అక్కడ నుండీ వెళ్లిపోయారు. ఈ విషయం పై చిరు ఆగ్రహం వ్యక్తం చేసి.. రాజశేఖర్ పై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ డిసిప్లినరీ కమిషన్ ను కోరారు. ఆ తరువాత రాజశేఖర్ భార్య జీవిత.. తన భర్త చేసిన కామెంట్స్ కు చిరంజీవిని క్షమాపణలు కోరారు.

Once Again Chiranjeevi Vs Rajasekhar1

ఇక ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే రాజశేఖర్ తన ‘మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్’ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. అయితే రాజశేఖర్ రాజీనామా వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తుంది. రాజశేఖర్ రాజీనామా చేయకపోయినప్పటికీ… ఆయన పై ‘మా’ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. ఆయనకు ముందుగానే తెలియడంతో వెంటనే రాజీనామా చేసారని సమాచారం. ఇక రాజీనామా చేసిన తరువాత కూడా రాజశేఖర్.. మరోసారి ‘మా’ అధ్యక్షుడు నరేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

1

Rajashekar resigns from MAA as Executive Vice President1

2


అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus