పటాస్ మూవీ రానా చేయకపోవడానికి కారణం?

అనేక సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి మెగా ఫోన్ పట్టి తీసిన తొలి సినిమా పటాస్. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. కళ్యాణ్ రామ్ కెరీర్ ని మలుపు తిప్పింది. అయితే ఈ క‌థ‌ను క‌ల్యాణ్ రామ్ కంటే ముందు రానాకు అనిల్ వినిపించినట్టు తెలిసింది. క‌థ ఓకే అనుకుని షూటింగ్‌కు సిద్ధ‌మ‌య్యే సమ‌యానికి సినిమా క్యాన్సిల్ అయిందంట. ఈ విష‌యాన్ని రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు స్వయంగా వెల్ల‌డించారు. ” రానా కోసమే `ప‌టాస్‌` క‌థ‌ను ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌యారు చేశాడు. ఆ స్క్రిప్టులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. కొన్ని మార్పులు సూచించాను.

స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయింది. అంతా ఓకే అనుకున్న స‌మ‌యంలో సినిమాను వదులుకోవాల్సి వ‌చ్చింది. దానికి కార‌ణం “బాహుబ‌లి”. ఈ సినిమా షెడ్యూల్స్ మారిపోయింది. అనుకున్న రోజులు కంటే ఎక్కువ డేట్స్ కేటాయించవలసి వచ్చింది. అందువల్లే రానా పటాస్ ని వదులుకోవాల్సి వచ్చింది” అని సురేష్ బాబు చెప్పారు. ఆ సినిమా రానా తీసి ఉంటే అతని క్రేజ్ మరింత పెరిగేది. ప్రస్తుతం రానా ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబు నాయుడిగా కనిపించబోతున్నారు. అలాగే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నారు. అనిల్ రావిపూడి రానా బాబాయ్ వెంకటేష్ తో F2 మూవీ చేస్తున్నారు. కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో కలిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీతో పాటు వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus