ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2024 సంక్రాంతి రేసులో హనుమాన్ మూవీ కూడా ఉందనే సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలకు పోటీగా హనుమాన్ సినిమా విడుదలవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలవుతోంది. అయితే హనుమాన్ మూవీ రిస్క్ వెనుక అసలు లెక్కలు వేరే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
గుంటూరు కారం సినిమా తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కానుండగా హనుమాన్ మూవీ ఇతర భాషల్లో రిలీజ్ కానుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ సినిమాపై థియేట్రికల్ రిస్క్ తక్కువగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ రీజన్ వల్లే హనుమాన్ మూవీ సంక్రాంతి రేసులో నిలిచింది. తేజ సజ్జాకు ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ (Hanuman) సక్సెస్ సాధిస్తే తేజ సజ్జా మిడిల్ రేంజ్ హీరోల జాబితాలో చేరే అవకాశాలు అయితే ఉంటాయి. హనుమాన్ గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణమని చెప్పవచ్చు. హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. హనుమాన్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని భోగట్టా. స్క్రిప్ట్ విషయంలో ప్రశాంత్ వర్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.