Jr NTR: వార్2 మూవీ విషయంలో తారక్ సైలెన్స్ వెనుక అసలు లెక్కలివేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్2 సినిమాలో నటిస్తున్నా తారక్ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదనే సంగతి తెలిసిందే. వార్2 సినిమాలో తారక్ పాజిటివ్ రోల్ పోషిస్తున్నారా? లేక నెగిటివ్ రోల్ పోషిస్తున్నారా? ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్ మాత్రం వార్2 సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. వార్2 సినిమా గురించి స్పందించి ఆ సినిమాపై అంచనాలు పెంచేస్తే దేవర సినిమాపై ఆ ప్రభావం పడుతుందని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వార్2 మూవీ విషయంలో తారక్ సైలెన్స్ వెనుక అసలు లెక్కలివేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వార్2 మూవీ 2025 సంవత్సరం ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమా సక్సెస్ సాధించిన తర్వాత మాత్రమే అధికారికంగా వార్2 అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటివరకు తారక్ వార్2 షూటింగ్ లో పాల్గొన్నా దేవర  (Devara)   ప్రమోషన్స్ కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మే నెల 20వ తేదీన రిలీజ్ కానున్న దేవర టీజర్ తో ఈ సినిమా కథకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తారక్ వార్2 సినిమాలో నటించడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. వార్2 సినిమాతో తారక్ సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషల్లో స్ట్రెయిట్ సినిమాలు నటించడంపై ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

వార్2 సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అందుకే తారక్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వార్2 సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయని యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus