Chiranjeevi: చిరంజీవి సైలెన్స్ కు అసలు కారణమిదేనా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. జనరల్ ఎలక్షన్స్ ను మించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా ఎన్నికల కొరకు ప్రచారం చేయడంతో పాటు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. విష్ణు, ప్రకాష్ రాజ్ స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ మద్దతు ఇస్తుండగా విష్ణుకు బాలకృష్ణతో పాటు మరి కొందరు సినీ ప్రముఖులు మద్దతు ఇస్తున్నారు.

అయితే విమర్శలు, వ్యక్తిగత ధూషణల గురించి స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు స్టార్ హీరోలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు కూడా హాజరు కామని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ విమర్శల విషయంపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చిరంజీవికి ఏ మాత్రం నచ్చలేదని సమాచారం. రెండు ప్యానెళ్లలో కొంతమందిపై చిరంజీవి సీరియస్ అయ్యారని సమాచారం. విమర్శలు చేసుకోవడం వల్ల మన పరువే పోతుందని చిరంజీవి చెప్పినట్టు తెలుస్తోంది.

ఎన్నికలు పూర్తైన తర్వాత చిరంజీవి విమర్శల గురించి బహిరంగంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ డిసెంబర్ 17వ తేదీన రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ ఎన్నికల్లో 500 ఓట్లు పోల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరిగేలా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కృషి చేస్తున్నారు. ఎన్నికలు జరిగే వరకు మీడియా ముందు సైలెంట్ గా ఉండాలని చిరంజీవి భావిస్తున్నట్టు బోగట్టా.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus