Ram Prasad: మల్లెమాల వారితో సన్నిహిత సంబంధమే కారణమా?

బుల్లితెర పై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ టీమ్ ఒకటి. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ ఈ ముగ్గురు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి జబర్దస్త్ కార్యక్రమం పై గత కొన్ని సంవత్సరాల నుంచి అద్భుతమైన స్కిట్ ల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో స్నేహితులుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్ళిపోయారు.

సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఈ కార్యక్రమం నుంచి తప్పుకోగా ఆటో రాంప్రసాద్ మాత్రమే ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నారు. సుడిగాలి సుధీర్ గెటప్ శీను జబర్దస్త్ నుంచి వెళ్లి పోవడానికి కారణం సినిమా అవకాశాలని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సినిమా అవకాశాలు రావడం వల్ల వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. అయితే రామ్ ప్రసాద్ కూడా నటుడిగా మాత్రమే కాకుండా మంచి రైటర్ గా కూడా ఎంతో గుర్తింపు పొందారు.

సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీనుకి వచ్చిన సినిమా అవకాశాలు ఈయనకు రాకపోవడం ఏంటి అని పెద్దఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను వెళ్లిపోవడానికి ఆటో రాంప్రసాద్ అక్కడే కొనసాగడానికి గల కారణం ఏంటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిచి వెళ్ళకపోవడానికి కారణం ఉందని, జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆటో రాంప్రసాద్ కు సంబంధించిన వాళ్ళు ఉండటం వల్ల ఆయన ఇప్పటికీ ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నారని తెలుస్తోంది.

ఇలా జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల ఆటో రాంప్రసాద్ కుమల్లెమాల వారితో కూడా మంచి అనుబంధం ఉందని, ఈ అనుబంధం కారణంగానే ఆయన ఇప్పటికీ జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నారని వార్తలు వస్తున్నాయి. మల్లెమాల వారితో అనుబంధం కారణంగానే ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదలకుండా ఇక్కడే ఉంటూ ప్రస్తుతం స్పెషల్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus