Adipurush: ఆదిపురుష్ ప్రమోషన్స్ కి సైఫ్ ఎందుకు దూరంగా ఉన్నట్లు.. అదే కారణమా..!

ఆదిపురుష్ సినిమా మరో 5 రోజుల్లో విడుదల కాబోతోంది. ప్రభాస్ హిందీలో నటించిన మొదటి స్ట్రైట్ మూవీ ఇది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తీశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ జూన్ 16 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్స్ అంతగా జరగడం లేదు.చాలా లేట్ గా ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో హిందీలో ప్రమోషన్ చేయాలా.. ? తెలుగులో ప్రమోషన్ చేయాలా? అన్నట్టు చిత్ర బృందం కన్ఫ్యూజ్ అవుతుంది? టైం తక్కువగా ఉండటంతో భక్తి అనే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు.

అన్నీ ఎలా ఉన్నా.. ఈ చిత్రంలో రావణుడు పాత్రను పోషించిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం (Adipurush) ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు. అందుకు కారణాలు ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అంటూ కొందరు అంటున్నారు.

గతంలో సైఫ్ .. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆదిపురుష్’ లో రావణ్ పాత్ర శ్రీరాముని(ప్రభాస్) పాత్ర కంటే బాగుంటుంది అన్నాడు. అందువల్ల చిత్ర బృందం ఇతన్ని మందలించినట్టు టాక్ నడిచింది. అందుకు సైఫ్ హర్ట్ అయ్యి ఉండొచ్చు అనేది ఒక కారణం.

రెండోది ‘ఆదిపురుష్ ‘ టీజర్ పై చాలా ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా సైఫ్ పది తలలతో కనిపించే విజువల్ పై కూడా సెటైర్లు పడ్డాయి. అది కూడా ఓ కారణమయ్యి ఉండొచ్చని కొందరు అంటున్నారు.

మూడోది ‘ఆదిపురుష్’ లో రావణ్ పాత్ర కొత్తగా డిజైన్ చేసారని.. సైఫ్ కనుక ప్రమోషన్స్ కి హాజరైతే ఆ సర్ప్రైజ్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని కూడా వారు భావిస్తున్నట్లు టాక్.

ఇక నాలుగోది.. సైఫ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. పైగా ఈ మధ్యనే ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అతని కాల్ షీట్లు ఖాళీ లేకపోవడం వల్లే ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ కి రావడం లేదు అంటున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus