యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా కొంతమేర గ్యాప్ తీసుకోవడం ఫ్యాన్స్ ను ఒకింత బాధ పెడుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో, వరుస షూటింగ్ లతో బిజీగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గత 15 నెలల నుంచి షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. ఈ నెల మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని ప్రచారం జరుగుతుండగా షూట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. చరణ్ అమెరికాకు వెళ్లడం ఆయనకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుండగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు మాత్రం మైనస్ అవుతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ వచ్చే అవకాశాన్ని తారక్ మిస్ చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆర్.ఆర్.ఆర్ కు సంబంధించిన ప్రతి ఈవెంట్ కు హాజరైన ఎన్టీఆర్ కీలకమైన సమయంలో హాజరు కాలేదు.
ఇకపై జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాకు సంబంధించిన ఈవెంట్లను అస్సలు మిస్ కావద్దని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంద్ తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. తారక్ కొరటాల శివ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లోని కొత్త టాలెంట్ ను సైతం బయటకు తెచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా ఈ జోడీ బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.