Tollywood: టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి కారణాలివే?

ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోందని సినీ నిర్మాతల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి టికెట్ రేట్లు కారణమని చెబుతుంటే మరి కొందరు మాత్రం పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలలో స్ట్రీమింగ్ కావడం కారణమని అభిప్రాయపడ్డారు. జులై నెలలో ఇప్పటివరకు ఎక్కువ సంఖ్యలోనే సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో ఒక్క సినిమా కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

రామారావ్ ఆన్ డ్యూటీ అయినా సక్సెస్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకున్న బయ్యర్లకు మేలు చేస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రేక్షకుల నుంచి మాత్రం సినిమాలపై ఆసక్తి చూపకపోవడానికి సంబంధించి ఆసక్తికర కారణాలు వినిపిస్తున్నాయి. టికెట్ రేట్లను తగ్గిస్తున్న నిర్మాతలు అదే సమయంలో మల్టీప్లెక్స్ లలో స్నాక్స్ పేరుతో జరుగుతున్న దోపిడీని కూడా అరికట్టాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.

సరైన కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ లేకుండా సినిమాలను తెరకెక్కిస్తే సినిమాలు హిట్టయ్యే అవకాశం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిర్మాతలు కంటెంట్ పై దృష్టి పెట్టకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వృథానే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రేక్షకుల కామెంట్ల విషయంలో నిర్మాతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే అంతోఇంతో సక్సెస్ సాధిస్తుండగా మిడిల్ రేంజ్ హీరోలు, చిన్న హీరోల సినిమాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus