యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయిన నాలుగు సీన్లు ఉన్నాయి. అవే సినిమా నచ్చడానికి, విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాయి.
మొక్కల గురించి..
సినిమా మొదట్లో మొక్కల విలువ గురించి తారక్ చెప్పే సీన్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. అందులో ఎన్టీఆర్ చెప్పేడైలాగులు ఇంటికి వెళ్లినా మరచిపోలేక పోతున్నారు. అందరూ ప్రకృతిని కాపాడాలని మంచి మెసేజ్ ని స్వీకరించారు.
రెండోది..
ఇంటర్వెల్ కి ముందు మోహన్ లాల్ ని కలిసేందుకు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కి వెళతాడు. అక్కడ మోహన్ లాల్ ని కలిసి అతని కొడుకు చేస్తున్న తప్పుల గురించి కంప్లైంట్ చేస్తాడు. అయితే .. అతను చేస్తున్న తప్పులు తెలిసి కూడా సైలెంట్ గా ఉంటే.. మీకూ, ఈ గ్యారేజ్ కి రిపేర్ చేయాల్సి ఉంటుందని అంటాడు. మోహన్ లాల్ ని చూసి గొప్ప రాజకీయనేతలు, రౌడీలు వణికి పోతారు. అలాంటి వ్యక్తినే ఎదిరించి ఓ కుర్రోడు మాట్లాడడం చూసి అక్కడున్న వారు ఖంగు తింటారు. ఈ సీన్ కథపై ఆసక్తిని పెంచింది.
మూడోది..
నిబద్దనలకు విరుద్ధంగా ఆసుపత్రి కట్టడానికి వీలు లేదని ఎంత బెదిరించిన సంతకం పెట్టకూడదని నిర్ణయించుకున్న ఉద్యోగి రాజీవ్ తో ఎన్టీఆర్ కి ఉన్న సీన్ ఎంతో ఎమోషనల్ గా సాగుతుంది. చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డ ఉద్యోగి గురించి తోటి ఉద్యోగులకు ఎన్టీఆర్ చెప్పే డైలాగులు, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కదిలించింది.
నాలుగోది..
ఒకరోజు విలన్ నేరుగా గ్యారేజీ కి వచ్చి ఎన్టీఆర్ తో కలుస్తాడు. అప్పుడతను ఎన్టీఆర్ కి ఒక పులి కథ చెబుతాడు. ‘అడవిలో ఉన్న పులి బతకాలంటే .. చిన్న చిన్న ప్రాణుల్ని చంపాలి, తినాలి. అది నేచర్. మార్చగలమా. నేనూ ఆ పులి లాంటి వాడినే. నేను బతకాలంటే.. చిన్న చిన్న ప్రాణులు కొందరు పోతారు” అని అంటాడు. ఆ కథని ఎన్టీఆర్ తీరిగ్గా విన్నాక .. “నువ్వు చెప్పింది కరెక్టే.. అడవిలో పులి బ్రతకాలంటే చిన్న ప్రాణులు చావాలి. అది నేచర్ .. అయితే నా కథలో నేనూ పులిని .. మీరు చిన్న చిన్న ప్రాణులు” అని అంటాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు చప్పట్లతో థియేటర్ ని అదరగొట్టారు.