Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ కచ్చితంగా చూడడానికి గల 11 కారణాలు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదల కాబోతుంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. ఆడియో మంచి హిట్ అయ్యింది.

టీజర్, ట్రైలర్ లు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీని మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చూస్తారు. కానీ మిగిలిన ప్రేక్షకులు కూడా థియేటర్ కు వెళ్ళాలి అంటే అందుకు వాళ్ళని ఆకర్షించే ఎలిమెంట్స్ కూడా ఉండాలి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) డౌట్ లేకుండా ఫస్ట్ మహేష్ బాబు ప్రధాన కారణం. ‘పోకిరి’ తర్వాత ఆ రేంజ్లో యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు అతని లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అతని కంఫర్ట్ జోన్ నుండీ బయటకి వచ్చి ఈ మూవీలో నటించినట్టు స్పష్టమవుతుంది.’భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్లతో అతను మంచి ఫామ్లో ఉన్నాడు.

2) ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి ఫామ్లో ఉన్న పరశురామ్.. ఓ పెద్ద హీరోని ఎలా హ్యాండిల్ చేశాడు అనే ఆసక్తి కూడా అందరిలోనూ ఉంది. పూరి జగన్నాథ్ శిష్యుడు కాబట్టి.. టేకింగ్ కూడా చాలా బాగుంటుంది అని వినికిడి.

3) ఈ మూవీలో ఎడారిలో చిత్రీకరించిన ఫైట్ చాలా బాగా వచ్చిందట. టీజర్,ట్రైలర్ వంటి వాటిలో కూడా దానిని బాగా హైలెట్ చేశారు. అది మహేష్ ఇంట్రో సీన్ అంటున్నారు. దుబాయ్ లో ఆ ఫైట్ సీన్ ను చిత్రీకరించారు.

4) ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ అలాగే వెన్నెల కిషోర్ తో మహేష్ చేసిన కామెడీ చాలా బాగా వచ్చిందట. ఫస్ట్ హాఫ్ అయితే రిపీటెడ్ గా చూసేలా ఉందని టాక్.

5) తమన్ ‘అఖండ’ ‘భీమ్లా నాయక్’ ‘రాధే శ్యామ్’ లకి మంచి నేపధ్య సంగీతం అందించాడు. ఈ సినిమాకి ఎలాంటి బి.జి.యం ఇచ్చాడో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

6) కళావతి పాట, మ మ మహేషా పాటలు కూడా సూపర్ గా వచ్చాయట. బిగ్ స్క్రీన్ పై చూడడానికి కూడా అవి బాగుంటాయని వినికిడి.

7) సముద్రఖని విలనిజం కూడా ఆకట్టుకుంటుంది అని తెలుస్తుంది. మహేష్ కు అతనికి మధ్య వచ్చే కాంబినేషనల్ సీన్స్ కూడా బాగుంటాయట. రివేంజ్ డ్రామాని కూడా దర్శకుడు బాగా డిజైన్ చేసాడట.

8) ఫస్ట్ హాఫ్ అంతా యూఎస్ లో ఉంటుందట, సెకండ్ హాఫ్ వైజాగ్ లో ఉంటుందని మహేష్ చెప్పాడు.నిర్మాణ విలువలు చాలా రిచ్ గా అనిపిస్తాయట.

9) మహేష్ కు బాగా ప్లస్ అయిన సింగిల్ లైన్ డైలాగులు ఓ రేంజ్లో పేల్తాయట. అంతేకాదు మంచి మెసేజ్ ఉన్న డైలాగులు, ఫిలాసఫీతో కూడుకున్న డైలాగులు చాలానే ఉన్నాయని వినికిడి.

10) మది సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది అని తెలుస్తుంది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది.

11) ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ సీరియస్ కథాంశంతో కూడుకున్న సినిమాలు.’భీమ్లా నాయక్’ ‘రాధే శ్యామ్’ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కె.జి.ఎఫ్2’ ‘ఆచార్య’ వంటి సినిమాలు అన్నీ అంతే..! సమ్మర్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ‘సర్కారు వారి పాట’ అవుతుందని టీం కాన్ఫిడెంట్ గా చెబుతుంది.అదొకటి బాగా ఆకర్షించే అంశం.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus