సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. టాప్ 5లో ఎంట్రీ!

ఒకప్పుడు ఓల్డ్ మూవీస్ (Movies) టీవీలో చూసే ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు తారలు మళ్లీ తెరపై కనిపించాలనుకునే ఫ్యాన్స్ కోరిక, నోస్టాల్జిక్ కంటెంట్ డిమాండ్, 4K టెక్నాలజీ.. సినిమాలను మళ్లీ థియేటర్ల దాకా తీసుకొస్తున్నాయి. రీ రిలీజ్ సినిమాలపై ఏర్పడిన క్రేజ్‌ను బట్టి చూస్తే ఇది తాత్కాలికమేమీ కాదు. కొత్త సినిమాలకే దీటుగా రీ రిలీజ్ మూవీలు ఓపెనింగ్స్ అందుకుంటుండటం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Top Re-Release Movies

ఈ మధ్య వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) (SVSC) 4K రీ రిలీజ్ఈ విషయంలో రివైవల్‌కు మంచి ఉదాహరణగా నిలిచింది. మల్టీస్టారర్‌గా మహేష్ బాబు (Mahesh Babu) – వెంకటేష్ (Venkatesh)  కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించడంతో ఫ్యాన్స్ భారీగా స్పందించారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కలిసొచ్చే కథా ముల్యాల్ని బేస్ చేసుకున్న ఈ సినిమా పాత వేళలా హిట్ ఫీల్‌నే మళ్లీ అందించింది. ఫలితంగా ఈ సినిమా రూ.6.60 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి రీ రిలీజ్ టాప్ 5లో స్థానం సంపాదించింది.

ఒక్కొక్క సినిమాకి ఒక్కో ట్రేడ్ పాయింట్ ఉన్నా.. థియేటర్‌కి వచ్చేవాళ్ల సంఖ్య చూస్తుంటే, కంటెంట్‌తో పాటు బ్రాండ్‌ వాల్యూ ఎంత కీలకమో అర్థమవుతోంది. ఉదాహరణకి తమిళంలో ‘ఘిల్లి’ (Ghilli) సినిమాను రీ రిలీజ్ చేయడంతో దాని కలెక్షన్లు రూ.32 కోట్ల మార్కును దాటాయి. తెలుగులో ‘మురారి’ 4K (Murari) వర్షన్ రూ.8.90 కోట్ల వసూళ్లు సాధించింది. ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) , ‘ఖుషి’ (Kushi), ‘బిజినెస్ మాన్’ (Businessman), ‘సింహాద్రి’ (Simhadri) వంటి సినిమాలు (Movies) కూడా అభిమానుల హడావుడి మధ్య భారీగా ఆడేశాయి.

రిసెంట్ టాప్ రీ రిలీజ్ మూవీ కలెక్షన్స్ లిస్ట్:

ఘిల్లి 4K – రూ.32.50 కోట్లు

మురారి 4K – రూ.8.90 కోట్లు

గబ్బర్ సింగ్ 4K – రూ.8.01 కోట్లు

ఖుషి – రూ.7.46 కోట్లు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC) రీ-రిస్ట్ – రూ.6.60 కోట్లు

బిజినెస్ మాన్ 4K – రూ.5.85 కోట్లు

దేవదూతన్ (మలయాళం) – రూ.5.30 కోట్లు

స్పడికం (మలయాళం) – రూ.4.90 కోట్లు

ఆరెంజ్ (Orange) 4K – రూ.4.71 కోట్లు (రెండో రీ-రిస్ట్ – రూ.1.35 కోట్లు)

సింహాద్రి 4K – రూ.4.60 కోట్లు

ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సాంకేతికంగా మెరుగైన ప్రెజెంటేషన్, అద్భుతమైన సౌండ్ మిక్సింగ్, 4K రీస్టోరేషన్ ద్వారా థియేటర్ అనుభూతిని రిఫ్రెష్ చేసి ప్రజల్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్తోంది. ఫ్యాన్స్ స్వచ్చందంగా ప్రొమోషన్ చేయడంతోనే సినిమాలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఇలా చూస్తే, రాబోయే కాలంలో మరిన్ని క్లాసిక్ సినిమాలు మళ్లీ వెండితెరపై సందడి చేసే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus