Pushpa 2: ఆడియో రైట్స్ కే.. ఆల్ టైం రికార్డు కొట్టిన ‘పుష్ప 2’.!

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ప్రభంజనం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగు నాట సంచలనం సృష్టించిన పుష్ప .. అప్పటి పాన్ ఇండియా మూమెంట్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా హిందీలో అడుగుపెట్టి నార్త్ ఆడియన్స్‌కి పూనకాలు తెప్పించింది. అల్లు అర్జున్ నటన, రష్మిక అందాలు , సుకుమార్ టేకింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఓవరాల్ రన్‌లో ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది.

అంతేనా.. ఇందులోని ‘‘తగ్గేదే లే’’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. చిన్నారుల నుంచి సెలబ్రెటీల వరకు గడ్డం కింద చేయి పెట్టుకుని తగ్గేదే లే అంటూ డైలాగ్ చెబుతూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక భారతీయ సినిమాలు, అందులోనూ తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టపడే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప గెటప్‌లో వీడియోలు చేసి అభిమానులను అలరించారు. ఇక పుష్ప ఘన విజయంలో పాటలది కీ రోల్. ‘‘ ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా ’’, ‘‘ ఊ ..అంటావా ’’, ‘‘ శ్రీవల్లి ’’ పాటలను భాషలకు అతీతంగా భారతీయులు ఆదరించారు.

ఈ క్రమంలోనే పుష్ప 2కోసం ప్రేక్షకులు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలావుండగా.. పుష్ప 2 ఆడియో రైట్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. టీ సిరీస్ సంస్థ తెలుగుతో పాటు విడుదలయ్యే అన్ని భాషల ‘‘పుష్ప 2’’ ఆడియో హక్కులను రూ.65 కోట్లకు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ‘‘ఆర్ఆర్ఆర్’’కు కూడా ఆడియో రైట్స్ రూపేణా రూ.30 కోట్లే వచ్చాయి.

కానీ పుష్ప 2 (Pushpa 2) మాత్రం అంతకు డబుల్ ఫిగర్ అందుకోవడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం సుకుమార్-దేవీశ్రీ ప్రసాద్ . వీరిద్దరిది తొలి నుంచి మంచి కాంబో. ఆర్య నుంచి తన ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగించారు సుకుమార్. దేవి కూడా తనపై వుంచిన నమ్మకాన్ని వమ్ముకాకుండా మెమెరబుల్ మ్యూజిక్ ఇచ్చాడు. అదే ఇప్పుడు పుష్ప 2 ఆడియో రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడానికి కారణం. మరి ఈ సినిమాలో పాటలు ఎలా వుంటాయో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus