Prabhas: అమెరికాలో రాధేశ్యామ్ కోసం అన్ని స్క్రీన్లా?

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. మార్చి 11వ తేదీన రికార్డు స్థాయిలో థియేటర్లలో రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. ప్రభాస్, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించగా దాదాపుగా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఓవర్సీస్ లో ఈ సినిమా రికార్డు స్థాయిలో స్క్రీన్లలో రిలీజ్ కానుంది.

Click Here To Watch

అమెరికాలో ఈ సినిమా ఏకంగా 1,116 లొకేషన్లలో 3,116 స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో మార్చి 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఓవర్సీస్ లో రికార్డు స్థాయి స్క్రీన్లలో రాధేశ్యామ్ రిలీజ్ కానుండటంతో ప్రభాస్ స్టామినాకు నిదర్శనం ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేస్తోందని సమాచారం అందుతోంది. రాధేశ్యామ్ ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. సాహో సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా రాధేశ్యామ్ తో ప్రభాస్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

ఒక్కరోజే ఈ సినిమా ఓవర్సీస్ లో 11,116 షోలు ప్రదర్శితం కానుంది. బాహుబలి2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. జిల్ తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన మూవీ రాధేశ్యామ్ కావడం గమనార్హం.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus