టాలీవుడ్‌కి అస్సలు కలసి రాని రీమేక్‌లు.. ఎక్కడ తేడా కొడుతోంది

రీమేక్‌లను ఇన్‌స్టంట్‌ హిట్లు అంటారు.. ఈ మాట మీరు వినే ఉంటారు. అయితే ఈ మాటను ఇప్పుడు వెనక్కి తీసుకోవాలా? ఏమో టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా వస్తున్న రీమేక్‌లు, వాటి ఫలితాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. కొన్ని సినిమాలకు బాగుంది అనే టాక్‌ వస్తున్నా, లాంగ్‌ రన్‌ ఉండటం లేదు. ఈ క్రమంలో సరైన డబ్బులు రావడం లేదు. ఇంకొన్ని సినిమాలైతే ఏకంగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యి కూర్చుంటున్నాయి. దీంతో రీమేక్‌ల విషయంలో రెడ్‌ అలర్ట్‌ పడింది అని చెప్పుకోవచ్చు.

రీమేక్‌లు ఏ సినిమా ఇండస్ట్రీకి కూడా కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా రీమేక్‌లు వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో హీరోలు పెరిగారు, రీమేక్‌లూ పెరుగుతున్నాయి. కొన్ని ఫ్రీమేక్‌లు కూడా ఉన్నాయనుకోండి. అవన్నీ కలుపుకుని చూస్తే.. ఇబ్బందే కనిపిస్తోంది. తెలుగులో రీసెంట్‌గా వచ్చిన రీమేక్ సినిమాలు మేకర్స్‌కు మంచి గుణపాఠాలు నేర్పాయి అని చెప్పొచ్చు. అయితే ఆ పాఠాలను వాళ్లు ఎన్ని రోజులు గుర్తు పెట్టుకుంటారు అనేదే విషయం.

* రీసెంట్‌ రీమేక్‌ల సంగతి చూస్తే పవన్‌ కల్యాణ్ – రానా ‘భీమ్లా నాయక్’, చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మినహాయించి మిగిలిన సినిమాలు తుస్‌ మన్నాయి. కనీస వసూళ్లు కూడా రాకుండా ఇబ్బందులు పడ్డాయి.

* రాజశేఖర్ రీసెంట్‌గా ‘శేఖర్’ అనే సినిమా చేశారు. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘జోసఫ్’ సినిమాను రీమేక్ చేశారు జీవిత రాజశేఖర్. పెద్దగా మార్పులు లేక, కొత్తదనం లేక సినిమా ఇబ్బందికర ఫలితం ఎదుర్కొంది.

* ‘ఓ మై కడవలే’.. తమిళంలో ఇటీవల కాలంలో వచ్చిన హిట్‌ సినిమా. ఆ సినిమాను విశ్వక్‌సేన్‌ ‘ఓరి దేవుడా’ అంటూ తీశారు. వెంకటేశ్‌ను కూడా సినిమాలో భాగం చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కలిసి తీసిన ఈ సినిమా ఫలితం ‘ఓరి దేవుడా’ అనిపించింది.

* కన్నడలో పరిశ్రమలో మంచి లవ్‌ స్టోరీస్‌లో ‘లవ్‌ మాక్‌టేల్‌’ ఒకటి. ఈ సినిమాను తెలుగులో సత్యదేవ్‌, తమన్నా చేశారు. స్లో పేస్‌ కథను యాజ్‌ ఇట్‌ ఈజ్‌ పేస్‌లో తీయడంతో.. ‘గుర్తుందా శీతాకాలం’ ఎక్కువ రోజులు గుర్తుండలేకపోయింది.

* మలయాళ ‘కప్పెలా’ సినిమాను ఇటీవల ‘బుట్టబొమ్మ’ పేరుతో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాస్టింగ్‌ విషయంలో వైవిధ్యంగా ఆలోచిచంచినా.. ఆ పాయింట్‌ మనవాళ్లకు నచ్చుతుందా అనే పాయింట్‌ మిస్‌ అయ్యారు. దీంతో ఆడియన్స్‌ సినిమాను థియేటర్లలో మిస్‌ చేసేశారు.

దీంతో టాలీవుడ్‌లో రీమేక్‌లంటే భయపడేలా పరిస్థితి మారిపోయింది. అయితే త్వరలో మరికొన్ని రీమేక్‌లు వస్తాయి. అవి హిట్‌ అయితే ఓకే.. లేదంటే మరోసారి ఆలోచించుకోవాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus