బాలీవుడ్ లో అవకాశం పట్టేసిన రెజీనా

తెలుగు సినిమాల్లో రెజీనాతో పాటు అడుగుపెట్టిన బ్యూటీలందరూ మంచి విజయాలందుకుంటూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరారు. ఎంతకష్టపడ్డ రెజీనాకు మంచి హిట్ దక్కలేదు. గత ఏడాది ఆమె నటించిన నక్షత్రం, నగరం, బాలకృష్ణుడు సినిమాలు రిలీజ్ అయి ఉన్న పేరుని కూడా పోగొట్టాయి. దీంతో కోలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఆమెకు బాలీవుడ్ లో మంచి సినిమాలు చేయాలనే కల ఉంది. గతంలో “ఆంఖేయిన్ 2 ” సినిమాలో ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఎంతో సంబరపడింది. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోవడం ఆమెకి నిరాశను కలిగించింది.

అయినా బాలీవుడ్ పై అసలు వదులుకోలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నింది. ఇన్ని సినిమాలు చేసినా కొత్త అమ్మాయిలు ఛాన్స్ కోసం తిరిగినట్టు ఆడిషన్స్ కి హాజరయ్యేది. దర్శకుడు షెల్లీ చోప్రధర్ తన సినిమాలో హీరోయిన్ కోసం నిర్వహించిన ఆడిషన్స్ కి వెళ్ళింది. తన నటనతో డైరక్టర్ ని మెప్పించింది. అందులో నటించే అవకాశాన్ని అందుకుంది. రాజ్ కుమార్ రావ్, అనిల్ కపూర్, జుహీ చావ్లా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న “ఏక్ లడ్కికో దేఖతో ఐసా లగా” సినిమాలో ఆమె నటించనుంది. ఈ చిత్రంతో మరిన్ని బాలీవుడ్ అవకాశాలు రెజీనా అందుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus