Regina Cassandra: బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన రెజీనా.. ఆ మీటింగ్స్‌ ఏంటి?

ఏడేళ్ల క్రితం బాలీవుడ్‌లో అడుగుపెట్టాల్సిన సౌత్‌ హీరోయిన్‌ రెజీనా కసాండ్రా (Regina Cassandra).. అనుకోని కారణాల వల్ల ఐదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇన్నేళ్లు మళ్లీ అక్కడ సినిమాలు చేయలేదు. అయితే వచ్చేడాది ‘జాట్‌’ సినిమాతో రాబోతోంది. ఈ క్రమంలో రెజీనా బాలీవుడ్‌ గురించి చేసిన కొన్ని కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. దానికి కారణం ఆమె చెప్పిన ‘మీటింగ్స్‌’ అనే పదం. 2019లో ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది రెజీనా.

Regina Cassandra

స్టార్‌ హీరోయిన్‌గా ఆ మధ్య కొన్నేళ్లపాటు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఆ తర్వాత ఫేడ్‌ అవుట్‌ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అయితే అనూహ్యంగా టాలీవుడ్‌ – బాలీవుడ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘జాట్‌’ సినిమాలో నటించే ఛాన్స్‌ సంపాదించింది. ఈ క్రమంలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో నటీనటులకు ఎదురయ్యే సవాళ్ల గురించి, ఇబ్బందులు గురించి ప్రస్తావించింది. అలాగే నార్త్‌ సినిమా పరిశ్రమకు, సౌత్‌ సినిమా పరిశ్రమకు మధ్య ఆమె గమనించిన విషయాలను కూడా చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. దక్షిణాది నుండి నార్త్‌ సినిమాకు వెళ్లి లాంగ్వేజ్‌ ఇష్యూస్ ఎదుర్కొన్నారు. ఈ కారణంగానే చాలామందికి సినిమాలు మిస్‌ అయ్యాయి.

కానీ బాలీవుడ్‌ నుండి ఇక్కడకు వచ్చినవాళ్లు ఎప్పుడూ ఆ ఇబ్బందిపడరు, ఇబ్బందిపెట్టరు కూడా అని అంది రెజీనా. హిందీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు ముంబయిలోనే ఉండాలని, మీటింగ్స్‌లో పాల్గొనాలని ఆమెకు చెప్పారట. దీంతో ఈ విషయం ఆమెకు పెద్దగా నచ్చకపోయినా.. బాలీవుడ్‌లో అదే ముఖ్యమని అర్థమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ మీటింగ్స్‌ ఏంటో అనే చర్చ నడుస్తోంది. ఇక రెజీనా సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం కోలీవుడ్‌లో ‘విదాముయార్చి’, ‘ఫ్లాష్‌బ్యాక్‌’లో నటిస్తోంది. బాలీవుడ్‌లో ‘జాట్‌’తోపాటు ‘సెక్షన్‌ 108’లో కూడా నటిస్తోంది.

స్టార్లందరూ కలిశారు… ‘సింగమ్‌’ కిచిడీ చేశారు… జనాలు రిజెక్ట్‌ చేశారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus