నిశ్చితార్థం చేసుకున్నరెజీనా

సెక్సీ డ్రస్సులతో వేడుకలకు హాజరై ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది రెజీనా. ఈ ముద్దుగుమ్మ పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద వంటి విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోతోంది. తెలుగులోనే కాకుండా తమిళంలో బిజీ నటిగా మారింది. ప్రస్తుతం ఆమె నటించిన శంకర రేపు విడుదల కానుంది. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమాలో నటిస్తోంది. ఏకకాలంలో 3 తమిళ సినిమాలు చేస్తోంది.

ఇటువంటి సమయంలో రెజీనా నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఉంగరం తొడిగిన చేతులున్న ఎంగేజ్ మెంట్ ఫోటోని ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసి అభిమానుల ఆశీస్సులు కోరింది. ‘ఈ ప్రత్యేకమైన రోజున మీ బ్లెస్సింగ్స్ కావాలి. నేను పెళ్లి చేసుకోబోయే వారు ఎవరో చూపించాలని ఉంది. కానీ ఇప్పుడే కాదు. త్వరలోనే చూపిస్తాను” అని రెజీనా ఆనందాన్ని వ్యక్తం చేసింది. రా రా కృష్ణయ్య, కొత్త జంట చిత్రాల్లో యువకుల మనసు దోచుకున్న ఈ భామ మనసు గెలుచుకున్న ఘనుడు ఎవరా? అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అతనెవరో తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి రెజీనా తన జీవిత భాగస్వామిని ఎప్పడు చూపిస్తుందో..!!

https://www.youtube.com/watch?v=C_ArfCfrlnA

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus