పవన్ కు హార్డ్ కోర్ ఫ్యాన్ అన్న రేఖా భోజ్.. త్రివిక్రమ్ ను అనలేదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు దక్కాలని తాను తెలుగు సినిమాలలో హీరోయిన్ గా సక్సెస్ సాధించాలని భావిస్తున్న నటీమణులలో రేఖా భోజ్ ఒకరు. చిన్న సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన రేఖా భోజ్ భవిష్యత్తులో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు. మూడు రోజుల క్రితం రేఖా భోజ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మల్లూ మీనన్లకే కాదు తమపై కూడా దయ చూపాలని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ కాగా కొంతమంది మాత్రం ఆమెపై ట్రోల్స్ చేశారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ రేఖా భోజ్ ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప మనిషి అని ఆమె పేర్కొన్నారు. 90 శాతం పీకే ఫ్యాన్స్ మంచివాళ్లని అయితే 10 శాతం పీకే ఫ్యాన్స్ వల్ల జనసేనకు నష్టం కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. త్రివిక్రమ్ ను నేను తిట్టానని కొంతమంది పీకే ఫ్యాన్స్ నన్ను ట్రోల్స్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

తాను పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అని ట్రోల్స్, నెగిటివ్ కామెంట్ల వల్ల తాను హర్ట్ అయ్యానని రేఖా భోజ్ తెలిపారు. తాను గురూజీని అస్సలు తిట్టలేదని రేఖా భోజ్ వెల్లడించారు. తాను కేవలం అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. కామెంట్లతో రెచ్చగొట్టే కొద్దీ రెచ్చిపోతూ ఉంటా పీకే ఫ్యాన్ ఇక్కడ అని రేఖా భోజ్ పేర్కొన్నారు. కొంతమంది కామెంట్ల వల్ల పవన్ కు నష్టం కలుగుతోందని ఆమె అన్నారు.

రేఖా భోజ్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రేఖా భోజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. టాలీవుడ్ లో తెలుగమ్మాయిల సక్సెస్ రేట్ తక్కువే కాగా రేఖా భోజ్ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. కవర్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన రేఖా భోజ్ హీరోయిన్ గా మాత్రమే కెరీర్ ను కొనసాగించాలని భావిస్తుండటం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus