ఈ ఏడాది చివరి సినిమా నిఖిల్ దే!

యంగ్‌ హీరో నిఖిల్‌ తాజాగా నటిస్తున్న మూవీ “ముద్ర”. తమిళంలో ఘన విజయం సాధించిన “కణిథన్” మూవీని తెలుగులో “ముద్ర” పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. తమిళ దర్శకుడు టి.ఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ యువ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న‌ది.

కాగా ఈ మూవీని న‌వంబ‌ర్ 8వ తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇంత‌కు ముందే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే దీపావ‌ళికి భారీ చిత్రాలు రిలీజ్ కానుండటంతో ఈ మూవీ విడుద‌ల‌ను డిసెంబ‌ర్ 28వ తేదికి వాయిదా వేశారు. విజయ్‌ “సర్కార్‌”, ఆమిర్‌ ఖాన్‌ “థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌” దీపావళి కానుకగా విడుదల కానుండగా.. రజనీకాంత్‌ 2.0 నవంబర్‌ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిఖిల్‌ “ముద్ర”ను వాయిదా వేయ‌క‌త‌ప్ప‌లేదు. అయితే.. ఈ ఏడాది నిఖిల్ సినిమాతో ఇయర్ ఎండ్ అవుతుందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus