Kushi Movie: సమంత – విజయ్ దేవరకొండల ‘ఖుషి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • March 23, 2023 / 06:47 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండల క్రేజీ కాంబోలో.. ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్’ చిత్రాలతో ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ వారు నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘ఖుషి’.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాని గతేడాది డిసెంబర్ 23న రిలీజ్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆలస్యమవడంతో కొంత కాలం గ్యాప్ వచ్చింది.. తర్వాత ఫిబ్రవరికి వాయిదా వేశారు కానీ కుదరలేదు..

ఇటీవలే సామ్ బ్యాలెన్స్ షూటింగ్ స్టార్ట్ చేసింది.. ‘లైగర్’ తర్వాత పూరి జగన్నాథ్ కారణంగా విజయ్ సినిమా మీద బయ్యర్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదని.. ఒకవేళ చేస్తే.. సమంత, మైత్రీ మూవీస్ వారి ట్రాక్ రికార్డ్‌ని బట్టి బిజినెస్ చెయ్యొచ్చని వార్తలు వచ్చాయి కూడా.. అలాగే ఇటీవల సామ్.. ఓ సీన్ కోసం మెళ్లో పసుపుతాడు, నల్లపూసలు వేసుకుంది.. దీన్ని ఎవరో ఫోటో తీసి నెట్‌లో పెట్టడంతో సమంత రెండో పెళ్లి చేసుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి..

ఇక ఇదిలా ఉంటే రీసెంట్‌గా రౌడీ స్టార ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘ఖుషి’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.. విడుదల తేదీతో వదిలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.. ‘ది టు వరల్డ్స్ విల్ మీట్ ఆన్ సెప్టెంబర్ 1’ అంటూ విడుదల తేదీ అనౌన్స్ చేశారు.. ‘ఖుషి’ పాన్ ఇండియా ఫిలిం అంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో భారీగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు..

లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కిన ఈ మూవీ అలాగే సమంత, విజయ్ దేవరకొండల పెయిర్, కెమిస్ట్రీ ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయని.. సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా అలరిస్తుందని టీం చెప్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటోంది..తర్వాత విజయ, గౌతమ్ తిన్ననూరి మూవీకి షిప్ట్ కానున్నాడు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus