సుమారు 48 రోజుల నుండీ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. షూటింగ్ ముగించుకుని ఈ పాటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. అయితే ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జూన్ 1 నుండీ షూటింగ్ లు మొదలు పెట్టుకోవచ్చు అని ఈ డైరెక్ట్ గా చెప్పారు. అయితే ఇప్పుడు తెలంగాణలో పరిస్ధితి మళ్ళీ ఆందోళన కారంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో షూటింగ్ లకు పర్మిషన్ ఇస్తుందా ప్రభుత్వం..? అంటే కాస్త ఆలోచించాలి.
ఇదిలా ఉంటే… జూన్ నెల మధ్య నుండీ థియేటర్ లు ఓపెన్ చేసే డిస్కషన్లు జరుగుతున్నాయి అని తెలుస్తుంది. రోజుకి మూడు షోలు చొప్పున షో లు ఉంటాయట. ఇక ఒక షో నుండీ మరో షో కి 45 నిమిషాల వరకూ గ్యాప్ ఉంటుందట. అంతే కాదు షో మధ్య వచ్చే గ్యాప్ లో సానిటైజర్లతో ఎక్కువగా క్లీనింగ్ చెయ్యాలని వారు చెబుతున్నారట. ఇలా మెల్లగా జనాలు థియేటర్ లకు రావడం మొదలు పెట్టాక… నాని ‘వి’ చిత్రాన్ని జూలై 3న అలాగే…జూలై 17 న ‘ఉప్పెన’ , జూలై 31 న ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలను విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇవన్నీ జరగాలి అంటే ముందుగా ఏపీ+తెలంగాణ ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వాలి. అవి జరగాలి కొంచెం టైం పడుతుంది. లాక్ డౌన్ తెలంగాణ లో మే 29 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మే 17 వరకూ అని ప్రకటించారు. కాబట్టి మే 15 న లాక్ డౌన్ ఎత్తేసేది లేనిది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు