మరో 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. చరణ్, తారక్ అభిమానులు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా ఆర్ఆర్ఆర్ సినిమాను థియేటర్లలో చూసే విషయంలో ఫ్యాన్స్ అస్సలు తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీకి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Click Here To Watch NEW Trailer
అయితే మేకర్స్ ఈ సినిమాను ఈ ఏడాది జనవరి 7వ తేదీన రిలీజ్ చేయకుండా మార్చి 25వ తేదీకి వాయిదా వేసి మంచి పని చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జనవరిలో ఈ సినిమా విడుదలై ఉంటే ఆ సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వచ్చేవి కావు. జనవరిలో ఏపీ ప్రభుత్వం ఈ స్థాయిలో టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేది కాదు.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో పాటు ఇతర దేశాల్లో కూడా పెద్ద సినిమాల విడుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. జనవరిలో పలు రాష్ట్రాల్లో అమలులో ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు తొలగిపోయాయి. అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు కళ్లు చెదిరే విజువల్స్ తో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆర్ఆర్ఆర్ విడుదలవుతోంది. రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ రిజల్ట్ రామ్ చరణ్, తారక్ కెరీర్ కు కీలకం కానుంది. కొత్త తరహా కథాంశంతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు దర్శకునిగా తన స్థాయిని పెంచుకుంటున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!