అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ అఫీషియల్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా సినిమా తీస్తున్నప్పుడు మరి రెమ్యునరేషన్ ఎలా ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు రెండు భాగాలుగా చేసే ఆలోచన లేదు. కానీ షూటింగ్ సమయంలో సినిమా ఫుటేజ్ 4 గంటల వరకు వస్తుందనే నిర్ధారణకు వచ్చాడు దర్శకుడు సుకుమార్.
నాలుగు గంటల సినిమాను రెండున్నర గంటలకు కుదించడం కంటే సినిమాను రెండు భాగాలుగా డివైడ్ చేసి అమ్ముకుంటే కమర్షియల్ గా డబుల్ ప్రాఫిట్ అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా ఎవరికీ ఎక్కువ చెల్లించడం లేదు. సుకుమార్ తన రెమ్యునరేషన్ కి అదనంగా రూ.5 కోట్లు, అల్లు అర్జున్ కి రూ.10 కోట్లు దక్కుతున్నాయని సమాచారం. కెమెరామెన్, సంగీత దర్శకుడికి సైతం బోనస్ దక్కుతుందని.. తమ రెమ్యునరేషన్ లో పాతిక శాతం అందనంగా లభించనుందని తెలుస్తోంది.
ఈ సినిమాను అమ్మే విషయంలో కూడా మైత్రి సంస్థ సరికొత్త పద్దతులను పాటించబోతుందట. మైత్రి సంస్థకు ఎప్పుడూ కూడా తమ దగ్గర ఉండే బయ్యర్లకు మాత్రమే సినిమాను అమ్ముతారు. ఈసారి కూడా అదే బ్యాచ్ కు ‘పుష్ప’ను అమ్మబోతున్నారు. రెండు భాగాలు ఒకేసారి ప్యాకేజీలా తీసుకుంటే ఒక రేటు, విడివిడిగా తీసుకుంటే మరో రేటు చొప్పున సినిమాను అమ్ముతారట. రెండు భాగాలూ ఒకేసారి కొన్నవాళ్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని సమాచారం.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!