Renu Desai: ‘తోడు కావాలి’ అంటున్న రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాజీ భార్య కాబట్టి..! పవన్ తో ఈమె విడాకులు తీసుకున్న తర్వాత ఈమె ఎక్కువగా వార్తల్లో నిలిచేది. ఏదో ఒక విషయంలో ఈమెను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మనం చూశాం. ఈమె దర్శకురాలిగా మారుతూ ఓ సినిమా తీసింది. అందుకోసం ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది.

అంతే ఆ ఛాన్స్ దొరకడంతో పవన్ ఫ్యాన్స్ ఈమెను టైం దొరికినప్పుడల్లా టార్గెట్ చేశారు. 2018 లో ఈమె రెండో పెళ్ళికి రెడీ అయ్యింది. ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ వ్యక్తి ఎవరు అన్న విషయం ఈమె బయటపెట్టలేదు. తర్వాత ఆ వ్యక్తితో రేణు పెళ్లి జరిగింది కూడా లేదు. ప్రస్తుతం తన కొడుకు, కూతురుతో జీవిస్తూ వస్తున్న రేణు దేశాయ్ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో వారి కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పెట్టిన ఓ పోస్ట్ మళ్ళీ తన రెండో పెళ్లి వ్యవహారాన్ని గుర్తుచేసే విధంగా ఉంది అనే చెప్పాలి. ‘జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకొని నడిపించే ఒక తోడు కావాలి’.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌ చేసింది. ఈ పోస్ట్ చాలా చర్చలకు దారి తీసిందనే చెప్పాలి. ‘రేణు మళ్ళీ ఇలా పోస్ట్ పెట్టింది అంటే ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందా?’ అని కొంతమంది… ‘లేదు ఆ వ్యక్తినే త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ మరి కొంతమంది’ కామెంట్లు పెడుతున్నారు. దీని పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక కెరీర్ పరంగా చూసుకుంటే.. మొన్నటి వరకు పలు టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చిన రేణు దేశాయ్ ఇప్పుడు వాటికి కూడా దూరంగా ఉంటుంది. ఈమె బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో అక్క పాత్ర పోషిస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ సినిమాల్లో నటించే ఉద్దేశం ఇప్పట్లో లేదు అని ఆమె చెప్పుకొచ్చింది. ‘కచ్చితంగా ఈ పాత్ర మిస్ చేసుకోకూడదు అనేలా వస్తే మాత్రం వదులుకోను’ అని కూడా ఈమె గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus