Renu Desai: మరోసారి పవన్ ఫ్యాన్స్ తో కామెంట్ల యుద్ధానికి దిగిన రేణు దేశాయ్.!

  • June 22, 2024 / 11:17 AM IST

‘రేణు దేశాయ్ (Renu Desai) వర్సెస్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్’..! ఇది కొత్త విషయం ఏమీ కాదు..! పవన్ తో విడాకులు తీసుకున్న రోజు నుండి రేణు దేశాయ్ ..పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నోరు పారేసుకోవడం.. దానికి ఆమె కౌంటర్ ఇవ్వడం మామూలు విషయం అయిపోయింది. తాజాగా మరోసారి పవన్ ఫ్యాన్స్ తో రేణు దేశాయ్ కామెంట్ల యుద్ధానికి దిగింది. వివరాల్లోకి వెళితే.. ‘‘మీరు చాలా దురదృష్టవంతురాలు. ఎందుకంటే మీకు అందమైన కొడుకు, కూతురు ఉన్నారు.

కానీ భర్తతో కలిసుండే అదృష్టం లేదు” అంటూ కామెంట్ చేశాడు. ఇది రేణు దేశాయ్ కి నచ్చలేదు. దీంతో ఆ నెటిజెన్ కామెంట్ పై ఆమె కొంచెం ఘాటుగానే స్పందించింది. రేణు దేశాయ్ స్పందిస్తూ.. ‘‘నేను ఎలా దురదృష్టవంతురాలిని అవుతాను.? కొంచెం చెప్తారా.? తెలుసుకోవాలని నాకు కూడా ఆసక్తిగా ఉంది.నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

కాబట్టి ఎన్నో ఏళ్లుగా కొంతమంది నన్ను దురదృష్టవంతురాలు అని అనుకుంటున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. నాకు ఓపిక నశించిపోతుంది. నా అదృష్టం అనేది ఓ మగవాడితో ఎందుకు ముడిపడి ఉంటుంది? ఈ జీవితం దొరకడమే నేను అదృష్టంగా భావిస్తాను. నా జీవితంలో లేనిదాని గురించి బాధపడడం కంటే ఉన్నదానితో సంతోషంగా ఉంటాను.. ఉన్నాను.

విడాకులు తీసుకున్న మగవారు, ఆడవారు.. కేవలం వాళ్ల పెళ్లి వర్కవుట్ అవ్వకపోతే వాళ్లు దురదృష్టవంతులు అని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. అలాంటివి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus