Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరోమారు సంచలన కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మరోమారు సంచలన కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

  • July 6, 2018 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోమారు సంచలన కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ పార్టీ పుట్టకముందు.. తర్వాత అన్ని రీతిన మారిపోయింది. జనసేన పార్టీని స్థాపించి విస్తరించే దిశలో నడుముబిగించిన సమయంలో విమర్శలు చేస్తున్నారు.. విమర్శలను ఎదుర్కుంటున్నారు. అతని అభిమానులకు, యాంటీ అభిమానులకు మధ్య పవన్ కంటే అతని రెండో భార్య రేణు దేశాయ్ ఎక్కువగా నలిగిపోతున్నారు. రేణు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత విమర్శలను తట్టుకోలేక ట్విట్టర్ నుంచి బయటికి వెళ్లారు. అయినా ఆమెకు తిప్పలు తప్పడం లేదు. దానిపై ఆమె నేడు పేస్ బుక్ వేదికపై స్పందించారు. “నా జీవితం ప్రశాంతంగా ఉండడానికి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌నే వాడాలని అనుకున్నాను. కానీ జీవితంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. గత ఐదేళ్లుగా నన్ను అనరాని మాటలు అంటున్న వారి గురించి పట్టించుకోవద్దని కొందరు నాకు సలహా ఇచ్చారు. నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నా కోసం నేను మాట్లాడుతుంటే అన్నీ మౌనంగా భరించాలని చెప్పారు.

పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నానని మరికొందరు అన్నారు. ఇప్పుడేమో ఓ నీచుడు పవన్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో పెడుతూ నెగిటివ్‌ కామెంట్లు చేస్తున్నాడు. కొందరేమో పవన్‌ కల్యాణ్‌ను సపోర్ట్ చేయాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే మరికొందరు బెదిరిస్తున్నారు. ఆయనకొక రూల్‌, నాకొక రూలా? గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? నోరుమూసుకుని అన్నీ భరించమని నాకు సలహాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందని నన్ను స్పందించమని అడుగుతున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఈ సమాజంలో ఉంటున్నందుకు చాలా బాధగా ఉంది. నేనెప్పుడూ పవన్‌ గురించి తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడమని నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు” అని అనేక ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పారు. మరి దీనిపై ఇంకెన్ని విమర్శలు పుట్టుకొస్తాయో చూడాలి.

renu-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Renu Desai
  • #Renu Desai Inteview
  • #Renu Desai Marriage

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

9 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

10 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

11 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

11 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 hours ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

6 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

7 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version