Prabhas, Resul Pookutty: ప్రభాస్ పై రసూల్ పోకుట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • August 3, 2022 / 12:30 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవడంతో ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో ఉంది. వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ అంటే ఇతర హీరోల అభిమానులు సైతం ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. సౌండ్ డిజైనర్ గా పాపులర్ అయిన రసూల్ పోకుట్టి ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్టార్ హీరో ప్రభాస్ డార్లింగ్ అని పని విషయంలో ప్రభాస్ ప్రొఫెషనల్ గా ఉంటారని రసూల్ పోకుట్టి తెలిపారు. టెక్నీషియన్లపై ప్రభాస్ ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటారని టెక్నీషియన్లను ప్రభాస్ ఎంతో గౌరవిస్తాడని రసూల్ పోకుట్టి పేర్కొన్నారు. ప్రభాస్ ఈ విధంగా చేయడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు ప్రపంచాన్ని సృష్టించగలుగుతారని అదే ప్రభాస్ సక్సెస్ కు కారణమని రసూల్ పోకుట్టి అన్నారు. ప్రభాస్ అంటే తనకు ఎంతో అభిమానమని రసూల్ పోకుట్టి కామెంట్లు చేశారు.

ప్రభాస్ ప్రస్తుతం కాలికి గాయం కావడంతో విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.

ప్రభాస్ గత సినిమాలు నిరాశపరిచినా తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కెరీర్ విషయంలో ప్రభాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకులకు మాత్రమే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus