Revanth: నోరుజారిన రేవంత్.. క్లాస్ పీకిన ఇనయ..! ఇనయని ఏమన్నాడంటే..?

బిగ్ బాస్ హౌస్ లో గార్డెన్ ఏరియా అడవిలాగా మారిపోయింది. ఈ అడవిలో ఉన్న బొమ్మలని సమయానుసారం సౌండ్స్ వచ్చినపుడు దొంగలు వచ్చి కొట్టేయాలి. వీరిని పోలీసులు అడ్డుకోవాలి. ఇక్కడే దొంగల టీమ్ లో ఉన్న సూర్య, శ్రీహాన్, ఇంకా రేవంత్ ముగ్గురూ గేమ్ ని ఎగ్రెసివ్ గా ఆడారు. ఫస్ట్ సౌండ్ వచ్చినపుడు దూసుకుని వెళ్లిపోయారు. ఇలా వేళ్లే టపుడు సూర్యని లాక్ చేశాడు బాలాదిత్య. ఆదిరెడ్డి కూడా పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడే సూర్య తనకి లెగ్ పైయిన్ ఉందని చెప్పి కొంచెంసేపు ప్రయత్నించి తప్పించుకున్నాడు.

ఇది పోలీస్ టీమ్ లో ఉన్న ఇనయకి నచ్చలేదు. దీంతో ఇలా హెల్త్ ఇష్యూస్ అని స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు అంటూ మాట విసిిరింది. దీంతో అక్కడున్న శ్రీహాన్ కి కాలింది. అలాగే, పోలీస్ టీమ్ లో ఉన్న సత్య నిజంగానే బాలేదంటూ చెప్పింది. అయినా ఇనయ వినిపించుకోకుండా మాట్లాడుతునే ఉంది. శ్రీహాన్ ని ఉద్దేశ్యించి వాడు వచ్చి మద్యలో లాక్కొను వెళ్లిపోయాడు అంటూ అరిచింది. దీంతో శ్రీహాన్ కి కోపం వచ్చింది. వాడు అంటే బాగోదు అంటూ ఇనయపై విరుచుకుపడ్డాడు. మద్యలో ఇది విన్న రేవంత్ వచ్చి ఇనయకి ఫుల్ క్లాస్ పీకాడు.

రేవంత్ ఇనయతో వాడు.. ఏంటి వాడు ఎలా మాట్లాడతావ్ అలా అంటూ ఆవేశపడ్డాడు. లాస్ట్ టైమ్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడావ్ అప్పుడు ఊరుకున్నా.. లాగి కొట్టాల్సింది అంటూ రెచ్చిపోయాడు. కొడతావా కొట్టు అంటూ ఇనయ రెచ్చగొట్టింది. తన కోపాన్ని కంట్రోల్ చేస్కుంటూనే లోపలకి వెళ్లాడు రేవంత్. మళ్లీ ఇనయ వాడు తీస్కుని వెల్లాడు అంటూ శ్రీహాన్ ని వాడు అన్నది. దీంతో రేవంత్ మళ్లీ రెచ్చిపోయాడు. అలా ఎలా మాట్లాడతావ్.. ఇంట్లో వాళ్లు నీకు నేర్పలేదా.. ఇదే నేర్చుకున్నావా అంటూ రెచ్చిపోయి మరీ నోరుజారాడు.

కోపంలో ఉన్న రేవంత్ ఇనయని పై విరుచుపడ్డాడు. మాటలతోనే రెచ్చగొట్టాడు. ఆ తర్వాత సూర్య ఇన్వాల్ అయి నేను స్వచ్ఛందంగా లొంగిపోతాను అంటూ జైల్లోకి వెళ్లాడు. నేను ఫెయిర్ గేమ్ ఆడతా నో డౌట్ అంటూ సూర్య జైల్లో కి వచ్చాడు. దీంతో శాంతించిన ఇనయ శ్రీహాన్ కి సారీ చెప్పడంతో ఈ ఆర్గ్యూమెంట్ కి తెరపడింది. కానీ, రేవంత్ మాత్రం ఇనయకి సారీ చెప్పలేదు. మరీ ఈ మేటర్ ఎక్కడివరకూ వెళ్తుంది. ఆటలో ఇంకా సమయం ఉంది కాబట్టి ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి. అదీ మేటర్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus