బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు ఫినాలే టాస్క్ కంటిన్యూ అవుతోంది. అయితే, ఈటాస్క్ లో ఆదిరెడ్డి గెలిచాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ, అందులో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా ఆటలో ఐదుగురు మిగిలి ఉన్నారు. వీళ్లలో రోహిత్, ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్ ఇంకా శ్రీహాన్ ఉన్నారు. రోల్ బేబీ రోల్ టాస్క్ లో ఏకాభిప్రాయంతో ఇంకో ఇద్దరిని తప్పుకోమని చెప్పాడు బిగ్బాస్. ఇక్కడే ఆదిరెడ్డి తెలివిగా వ్యవహరించాడు. రేవంత్ – ఆదిరెడ్డి ఇద్దరూ కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
అలా తప్పుకోవాలంటే తదుపరి రౌండ్ లో శ్రీహాన్ ఇంకా ఫైమా తప్పుకోవాలని అప్పుడే అందరికీ ఆడిన అవకాశం వస్తుందని చెప్పాడు. కీర్తి – రోహిత్ ఆల్రెడీ ఒక టాస్క్ లో తప్పుకున్నారు. ఇప్పుడు రేవంత్ ఆదిరెడ్డి తప్పుకుంటే వచ్చే టాస్క్ లో ఫైమా ఇంకా శ్రీహాన్ ఇద్దరూ తప్పుకునేలా ఒప్పందం చేస్కుని గేమ్ ఆడారు. ఈ రోల్ బేబీ రోల్ గేమ్ లోనే పెద్ద గొడవ అయ్యింది. శ్రీహాన్ టవర్ ఎత్తుగా కట్టినా కూడా కొద్దిగా గ్యాప్స్ ఉన్నాయి. అలాగే రోహిత్ టవర్ కొద్దిగా తగ్గినా కూడా స్ట్రాంగ్ గా ఉంది.
అయినా కూడా సంచాలకులు ఇద్దరూ కూడా శ్రీహాన్ టవర్ హైట్ ని చూసి కన్సిడర్ చేస్తూ విన్నర్ గా ప్రకటించారు. రోహిత్ కి రెండోస్థానం, ఫైమాకి మూడోస్థానం కీర్తికి నాలుగో స్థానం ఇచ్చారు. దీంతో కీర్తి బాగా హర్ట్ అయ్యింది. టవర్ ని కాలితో ఒక్క తన్ను తన్ని మరీ మీకు నచ్చిన వాళ్లకి ఇచ్చుకోండి అంటూ తన అసహనాన్ని ప్రదర్శించింది. శ్రీసత్య ఎక్సప్లనేషన్ ఇస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత కాసేపటికి నార్మల్ అయ్యింది. అయినా కూడా టాస్క్ లో తనకి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ లోనే ఉండిపోయింది.
ఇక ఆ తర్వాత గుడ్డుని బ్యాలన్స్ చేయాలనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇక్కడే రేవంత్ రెచ్చిపోయాడు. తర్వాత టాస్క్ లో గుడ్డుని బ్యాలన్స్ చేయాలని చెప్పారు. ఈటాస్క్ లో కేవలం ముగ్గురే పార్టిసిపేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. పాయింట్స్ లో తక్కువ ఉంది కాబట్టి కీర్తి తప్పుకుంది. అలాగే పైమా , శ్రీహాన్ మాట ఇచ్చారు కాబట్టి తప్పుకున్నారు. రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్ ముగ్గురూ ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడే రేవంత్ గుడ్డుని బ్యాలన్స్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు.
శ్రీసత్య, కీర్తి టచ్ చేస్తున్నావ్ అని చెప్తుంటే ఇరిటేట్ అయ్యాడు. సరిగ్గా చూడమని చెప్తూ గుడ్డుని అదుపులో ఉంచలేకపోయాడు. దీంతో ఈ టాస్క్ లో ఓడిపోయాడు. అందరికంటే ముందుగా ఐదు గుడ్లని గూట్లో వేసిన ఆదిరెడ్డి విన్నర్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ ఈ టాస్క్ ని కంప్లీట్ చేశాడు. రేవంత్ మాత్రం ఓటమిని తీస్కోలేక రగిలిపోయాడు. శ్రీసత్యని నిందిస్తూ ఒక్కరు మాట్లాడాలని కీర్తి కావాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడిందని చెప్పాడు. ఇద్దరి మద్యలో మాటల యుద్ధం జరిగింది.
ఆ తర్వాత కాసేపటికి రేవంత్ కూల్ అయ్యాడు. కీర్తి ఓడిపోయిందని కావాలని నువ్వు నాకు ఫేవర్ చేస్తున్నావని అనుకుంటోందని రేవంత్ అన్నాడు. ఇక ఈటాస్క్ లో ఓడిపోయి పాయింట్స్ లో వెనకబడ్డాడు రేవంత్, మొదటి స్థానంలో ఆదిరెడ్డి, రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో రేవంత్ ఉన్నారు. ఇక ఈ టిక్కెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.