సినిమా విడుదలకు ముందు లేదా విడుదలైన మొదటివారంలో సినిమా యూనిట్ డిఫరెంట్ ఇష్యూస్ ఫేస్ చేయడం అనేది బడా సినిమాలకు చాలా రెగ్యులర్ గా జరిగేదే. కానీ.. “భరత్ అనే నేను” టీం కి మాత్రం సినిమా విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత సినిమా విషయంలో కొత్త తలపోట్లు మొదలయ్యాయి. అది కూడా సినిమా గురించో లేక సినిమాలోని కంటెంట్, డైలాగ్స్ గురించో కాదు. సినిమాలో హీరో పేరు గురించి. ఈ సినిమాలో మహేష్ బాబు పోషించిన పాత్ర పేరు భరత్ రామ్ అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా విడుదలైన తర్వాత కాదు టీజర్ విడుదలప్పుడే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అలాంటప్పుడు పేరు ఇప్పుడు సమస్యగా ఎందుకు తయారయ్యింది అని ఆలోచిస్తున్నారా.
ఇంతకీ విషయం ఏంటంటే.. తెలంగాణ మంత్రి కేటీయార్ కావాలనే సినిమాలో మేకర్స్ కొరటాల సీవ & డి.వి.వి.దానయ్యాలను బెదిరించి సినిమాలో మహేష్ బాబు పాత్రకి తారక్ రామ్ తరహాలో భరత్ రామ్ అని పేరు పెట్టించుకొన్నారని ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ తరపు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. అసలు ఒక పేరుతో కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేయోచ్చనే విషయాన్ని రేవంత్ రెడ్డి ద్వారా తెలుసుకొన్న కొరటాల అండ్ బ్యాచ్ ప్రస్తుతం ఎలా స్పందించాలో లేక నవ్వుకోవాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు.