ఆ పోస్టర్ తో నాకు సంబంధం లేదంటున్న వర్మ

  • January 17, 2020 / 03:09 PM IST

వివాదాల వర్మ ఏ విషయం మీదనైనా మాట్లాడే విధానం, ఎదుటి వారు అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానం కొట్టినట్టు ఉంటుంది. వర్మ ఏ పని చేసినా.. ఎన్ని విమర్శలు వచ్చినా సంజాయిషీ ఇచ్చుకోవడం జరగలేదు. తాను చెప్పిందే నిజం, చేసిందే కరెక్ట్ నచ్చకపోతే మీ ఖర్మ అనే తత్వాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఐతే మొదటిసారి తాను చేయని పని విషయంలో అతను సంజాయిషీ మరియు స్పష్టత ఇచ్చారు. అదేమిటంటే తాను ట్వీట్ చేసినట్టు ఒక ఫేక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనీ..నిజానికి దానితో నాకు ఎటువంటి సంబంధం లేదనీ, ఎవరో మార్ఫింగ్ చేసి, నేను పోస్ట్ చేసినట్టు ప్రచారం చేస్తున్నారు అని ట్విట్టర్ పోస్ట్ పెట్టారు.

వర్మ ఇటీవల తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలో మన సేన పార్టీ అధినేత పాత్ర ఉన్న ఆ పోస్టర్ కొందరు మనోభావాలు దెబ్బ తీసేలా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ బి జే పి పార్టీతో కలుస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వర్మ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆ పోస్టర్ నిజంగా ఎవరో ఆకతాయిలు చేశారా.. లేక వర్మ ట్రిక్ లో భాగమా అనేది తెలియాలి. వివాదాస్పద చిత్రాలతో ఎప్పుడూ వార్తలలో ఉండే వర్మ ఈ మధ్య సైలెంట్ అయ్యారు.విడుదలకు ముందు సంచలనాలు చేస్తున్న ఆయన సినిమాలు విడుదల తరువాత ఎటువంటి ప్రభావం చూపడం లేదు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus