శ్రీరాపాక అలియాస్ స్వీటీ తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఉండరేమో. నగ్నం సినిమాతో వర్మ ఆమెను అంత ఫేమస్ చేశారు. ఆ ఒక్క సినిమాతో వచ్చిన ఫేమ్ తో ఆమె ఎడా పెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది. ఇప్పటికే అనేక యూట్యూబ్ చానల్స్ లో ఆమె సందడి చేశారు. దాదాపు పదేళ్లుగా ఫ్యాషన్ డిజైనర్ గా అనేక చిత్రాలకు పనిచేసిన శ్రీరాపాక ఇటీవల విడుదలైన వలయం మూవీలో కూడా నటించిందట. అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క పాత్ర కొరకు ఆమెను సంప్రదించారట.
ఐతే శ్రీరాపాక చేయనని చెప్పేసిందట. హీరోయిన్ గా మొదటి సినిమాలోనే తొడల అందాలతో కుర్రకారు గుండెల్ని పిండేసిన శ్రీ రాపాక తనబోల్డ్ రోల్ పై స్పందించింది. అసలు ఆ సినిమాలో బోల్డ్ రోల్ చేయలేదట. వర్మ తన కెమెరా యాంగిల్స్, క్రియేటివిటీతో అలా చూపించాడు కానీ, ఆమె అసలు వల్గర్ గా నటించలేదట. అలాగే వర్మ తనకు ఓ అద్భుతమైన రోల్ ఇచ్చి గుర్తింపు వచ్చేలా చేశాడు అంది. ఇక మొదటి సినిమాలోనే అలా ఎక్సపోసింగ్ చేస్తే అవకాశాలు వస్తాయా? అని యాంకర్ అడుగగా…
అనుష్క రకుల్ వంటి హీరోయిన్స్ స్టార్స్ గా ఎదిగిన తరువాత కూడా ఎక్సపోసింగ్ చేశారని, తాను చేస్తే తప్పేంటి అని ప్రశ్నిచింది. ఇక రెమ్యూనరేషన్ కోసం ఎలాంటి పాత్ర నైనా చేయనన్న ఆమె, వర్మకు రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమా తీయగల సత్తా నాకుందని చెప్పడం, గమనార్హం. ఇక పరిశ్రమలో కమిట్మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదని, శ్రీరాపాక చెప్పడం విశేషం.