Rgv – Sandeep Reddy: వోడ్కాతో వెల్కమ్‌.. డెవిల్‌ అంటూ నామకరణం.. ఫుల్‌ స్వింగ్‌లో జగపతి

టాక్‌ షోల యందు జయమ్మునిశ్చయమ్మురా వేరయా! అనేలా నడుస్తోంది జగపతిబాబు కొత్త టాక్‌ షో. ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాని కాంబినేషన్‌లు, వచ్చినా చెప్పని కబుర్లు, తెలియని విషయాలు ఇప్పుడు ఆ షో ద్వారా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం అదిరిపోయే కాంబినేషన్‌ ఒకటి వస్తోంది. అదే యానిమల్‌ + డెవిల్‌. ‘యానిమల్‌’ సినిమాలో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన సందీప్‌ రెడ్డి వంగా, ఇప్పటికే ఆ ముద్ర వేసేసి లెజెండ్‌ అయిన రామ్‌గోపాల్‌ వర్మ వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్‌ అయింది.

Rgv – Sandeep Reddy

నాగార్జున ‘శివ’ సినిమాలోని ‘బోటనీ పాటముంది… మేటనీ ఆట ఉంది’ పాటతో ఆర్జీవీ ఎంట్రీ ఇవ్వగా.. ‘అందరికీ రామ్ గోపాల్ వర్మ… నాకు మాత్రం సైతాన్’ అంటూ జగపతిబాబు తనదైన శైలిలో వైల్డ్‌ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ‘ప్రేక్షకుల కోసం సినిమా ఎప్పుడు తీస్తావ్?’ అని జగ్గూ అడిగితే.. ‘నేను నా లైఫ్‌‌‌లో నేర్చుకుంది ఏంటంటే? ఏది చెప్పినా ఎవడూ వినడు’ అని క్లారిటీ ఇచ్చేశారు వర్మ. దానికి ‘నీతో 10 నిమిషాలు కూర్చుంటే నేను నువ్వు అయిపోతా’ అంటూ కౌంటర్‌ వేశారు జగ్గూ.

నెక్స్ట్‌ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు వోడ్కా బాటిల్‌తో వెల్కమ్‌ చెప్పారు జగపతి. దీనికి ఆశ్చర్యపోయిన రామ్‌గోపాల్‌ వర్మ ‘వోడ్కా నాకెందుకు ఇవ్వలేదు.. సందీప్ సూపర్ డైరెక్టర్ నేను కాదనా?’ అంటూ సెటైర్‌ వేశారు. ఇవన్నీ వదిలేయండి ‘గర్ల్ ఫ్రెండ్స్’ సంగతేంటీ.. అది ఇంపార్టెంట్ మనకు’ అని జగపతి అడిగితే.. ‘మమ్మల్ని మేము ప్రేమించుకోవడానికే టైం లేనప్పుడు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా?’ అని ఆర్జీవీ ఆన్సర్‌ ఇచ్చారు.

నేను మీ క్లాస్ మేట్ అయ్యుంటే ఎట్లుండేది? అని సందీప్‌ అడిగితే ‘అంటే మనిద్దరిలో ఒకరు అమ్మాయైతే..’ తనదైన కౌంటర్‌ వేశారు వర్మ. అప్పుడే ఈ ఎపిసోడ్‌కి యాప్ట్ అయిన ‘ఒకరు డెవిల్, మరొకరు యానిమల్.. కూర్చుని ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే ముద్దుగా ఉంది’ అని జగ్గూ క్లోజింగ్‌ ఇచ్చారు.

 ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags