హద్దులు మీరి ట్వీట్స్ చేయడం.. ఆ తర్వాత అర్ధం కాకుండా క్షమాపణలు చెప్పడం రామ్ గోపాల్ వర్మకు సర్వ సాధారణం అయిపోయింది. టీచర్స్ డే నాడు ఇష్టమొచ్చినట్లు ట్వీట్స్ చేసి ఉపాధ్యాయులను కించపరిచిన ప్రముఖ డైరక్టర్, ఉమెన్స్ డే నాడు మహిళల గురించి కామెంట్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు. “సన్నీ లియోన్ లాగా మగాళ్లకు సుఖాన్ని పంచే ప్రతి మహిళకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు” అంటూ మార్చి 8 న వర్మ ట్వీట్ చేశారు. దీంతో అనేక మహిళా సంఘాలు డైరక్టర్ పై విరుచుకు పడ్డాయి. వర్మ ట్విట్టర్ అకౌంట్ రద్దు చేసి, అతనికి శిక్ష వేయాలని గోవాలో హిందూ జనజాగృతి వారు వర్మపై కేస్ నమోదు చేశారు.
ఈ విషయంపై దేశవ్యాప్తంగా విమర్శలు గుప్పుమనడంతో వర్మ వెనక్కి తగ్గారు. మహిళా దినోత్సవం నాడు పెట్టిన ట్వీట్ వల్ల ఇబ్బంది పడ్డ వారందరికీ ట్విట్టర్ వేదికపై క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమనిగింది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో సర్కార్ 3 తెరకెక్కిస్తున్నారు.