రాంగోపాల్ వర్మ చేసే సినిమాలే కాదు.. ఆయన మాట్లాడే మాటలు… చేసే పనులు కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంటాయి. ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయని మరోసారి నిరూపించాడు. విషయం ఏంటంటే… తన శిష్యుడు పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో హిట్టు కొట్టాడు. ఈ క్రమంలో వర్మ కూడా ఆ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంటున్నాడు. కానీ ఈసారి అందరిలా కాకుండా ఓ వింత ప్లాన్ వేసాడు వర్మ. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని చూసేందుకు.. మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ కు వెళ్ళాడు వర్మ.
అది కూడా.. బైక్ పై ట్రిపుల్ రైడ్ లో పాల్గొంటున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. వర్మతో పాటు ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం దర్శకుడు అజయ్ భూపతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు అగస్త్య కూడా ఈ ట్రిఫుల్ రైడ్ లో పాల్గొన్నారు. ‘హెల్మెట్’ లేకుండా వెళుతున్నాం అని వర్మ ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశాడు.
ఈ నేపథ్యంలో నెటిజన్లు.. ‘హైదరాబాద్ పోలీసులు నిద్రపోతున్నారా? ఇదే ప్లేస్ లో సామాన్యులు ఉంటే వాళ్ళకి వేలకు వేలు ఫైన్లు వేసి.. బైక్ ను తీసుకుపోతారు. సెలెబ్రిటీలు చేస్తే తప్పు లేదు.. రూల్స్ అన్నీ సామాన్యులకేనా? సెలబ్రెటీలకు ఓ న్యాయం… సామాన్యులకి ఓ న్యాయమా’ అంటూ కామెంట్లు చేస్తూ మండిపడుతున్నారు. ఏమైనా వర్మ చేసే చిన్న పనులు కూడా ఈ రేంజ్లో వైరల్ అవుతాయని మరోసారి ప్రూవ్ అయ్యింది.