ఇప్పటివరకు జరిగిన ఘోరాలు, కక్ష్యలు, పగలు, ప్రతీకారాలను బేస్ చేసుకొని సినిమాలు తీసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి భవిష్యత్ లో జరగబోయే కల్పిత కథతో చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ప్రపంచమంతా వణికిపోయే వరల్డ్ వార్ 3 కి కారణాన్ని ఊహించుకొని కథను క్రియేట్ చేశారు. నేడు ఆయన కథతో సహా సినిమా వివరాలను వెల్లడించారు.
“పాకిస్తాన్ వాళ్లు ఒక న్యూక్లియర్ బాంబ్ ని ముంబై లో పెట్టి.. తమకు కాశ్మీర్ కావాలని, లేకుంటే పేల్చేస్తామని బెదిరిస్తారు. భారత్, పాక్ గొడవలోకి అమెరికా ప్రవేశించి ఒకరికి తెలియకుండా మరొకరిని యుద్ధానికి ప్రేరేపిస్తుంది. దీంతో అనేక కోట్ల మంది ప్రాణాలు గాల్లో దీపాలవుతాయి”.. ఇది స్టోరీ లైన్. దీనికి న్యూక్లియర్ అని టైటిలి ఫిక్స్ చేశారు. సిఎంఏ గ్లోబల్ ప్రొడక్షన్ 340 కోట్ల బడ్జెట్ తో దీనిని నిర్మిస్తోంది. ఈ చిత్రం ద్వారా వర్మ హాలీవుడ్ లోకి ప్రవేశిస్తున్నారు. ట్విట్టర్ లో ఈ చిత్రం ప్రీ లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.