ముప్పైఏళ్ళ క్రితం విజయవాడలో జరిగిన వర్గపోరు నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన “వంగవీటి” అనే సినిమాపై రచ్చ ఆగడం లేదు. రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఈనెల 23 న విడుదలైన ఈ చిత్రాన్ని చూసిన వంగవీటి కుటుంబీకులు, ఆయన అభిమానులు వాస్తవాలు పక్కనబెట్టి సినిమా తీశారని వర్మపై విరుచుకుపడుతున్నారు. వారం రోజులుగా వర్మపై విమర్శలు గుప్పిస్తున్నారు. “వంగవీటి రాధాని రౌడీగా చుపిస్తావా? నీ అంతు చూస్తాం” అంటూ బెదిరిస్తున్నారు. వీటిపై వర్మ స్పందించారు. వంగవీటి బయోపిక్ కాదని స్పష్టం చేశారు.
గొడవలప్పుడు రెండు వర్గాల మధ్య ఉన్న ఎమోషనల్ డ్రామాను మాత్రమే తాను సినిమా తీసినట్లు చెప్పారు. ఇదే విషయాన్నీ మొదటి నుంచి చెబుతున్నట్లు వివరించారు. అప్పుడు జరిగిన వాస్తవాలు ఏమిటనేది వందశాతం కరక్ట్ గా ఎవరికీ తెలియదని వర్మ చెప్పారు. తన పరిశోధనలో తెలుకున్న విషయాల్లో వాస్తవాలకు దగ్గరగా ఉన్న వాటినే తెరపైన చూపించినట్లు పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ జరుగుతుండగానే మరో విషయం తెరమీదకు వచ్చింది. వంగవీటి టైటిల్ పాట పాడిన రాజశేఖర్ పన్నాల అనే గాయకుడి పేరు టైటిల్స్ లో వేయలేదని వాపోయారు. అది ఎడిటర్ తప్పుగా వర్మ చెప్పారు. సినిమాల్లో కొన్ని సార్లు అలా జరుగుతుందని వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.