RGV: మరో సంచలన ట్వీట్ చేసిన ఆర్జీవీ!

  • January 11, 2022 / 01:01 PM IST

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ల విషయంలో సంచలన ట్వీట్లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వర్మ నిన్న ఏపీ మంత్రి పేర్ని నానితో ఏపీ టికెట్ రేట్ల గురించి చర్చలు జరిగారు. అయితే ఈ చర్చల వల్ల ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి ప్రయోజనం చేకూరేలా ఎలాంటి సానుకూల ప్రకటన అయితే రాలేదు. అయితే ఇతర రాష్ట్రాల్లోని టికెట్ రేట్లతో పోలుస్తూ వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు.

మహారాష్ట్ర రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు గరిష్టంగా 2,200 రూపాయల వరకు టికెట్ రేటును అనుమతించారని వర్మ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సినిమా టికెట్లను 200 రూపాయలకు కూడా అమ్ముకునే పరిస్థితి అయితే లేదని వర్మ కామెంట్లు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలలోని ఐనాక్స్ మల్టీప్లెక్స్ లలో 2,200 రూపాయల వరకు సినిమా టికెట్లను విక్రయిస్తున్నారని వర్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఎక్కువ మొత్తంలో టికెట్ రేట్లకు టికెట్లు అమ్ముకునే పరిస్థితి లేదని కట్టప్పను ఎవరు చంపారంటూ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ గురించి ఏపీ మంత్రుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం థియేటర్లు రన్ కావాల్సి ఉంది. సంక్రాంతి పండుగకు విడుదలయ్యే సినిమాలకు ఈ నిబంధనల వల్ల నష్టమేనని తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా అయిన బంగార్రాజును నాగార్జున రిస్క్ చేసి రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

50 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బంగార్రాజుకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus