టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు స్టార్ హీరోల ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించే విధంగా ఉంటే మరి కొన్నిసార్లు మాత్రం అర్థం కాని విధంగా ఉంటాయి. తాజాగా వర్మ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తనకు నచ్చిన రాజకీయ నేత పవన్ కళ్యాణ్ అని వర్మ అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఇంకా అధికారం రాలేదని కానీ రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని వర్మ అన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రజల కొరకు ఏం చేస్తాడో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం తనకు లేదని వర్మ చెప్పారు. పవన్ కళ్యాణ్ తో తాను సినిమాను తెరకెక్కించలేనని పవన్ తో సినిమా తీసే సామర్థ్యం తనకు లేదని వర్మ తెలిపారు. పవన్ తో సినిమా అంటే కమర్షియల్ విలువలు, ఇతర అంశాల గురించి ఆలోచించాలని వర్మ చెప్పుకొచ్చారు. అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో పవన్ కూడా ఒకరు కావడంతో ఆయన సినిమాలపై భారీగా అంచనాలు ఉంటాయని వర్మ పేర్కొన్నారు.
కమర్షియల్ సీన్లు, డైలాగులు తన వల్ల కావని అందువల్ల తాను పవన్ ను హ్యాండిల్ చేయలేనని వర్మ వెల్లడించారు. సీఎం జగన్ గురించి తాను సినిమాను తీస్తానని ఆ సినిమా ఎలా ఉంటుందో తెరపై మాత్రమే చూడాలని వర్మ పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు జగన్ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తానని వర్మ తెలిపారు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!