దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అధిక సంపాదన కలిగిన తారలు వీళ్ళే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సినిమాలను చేస్తూ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ అధిక మొత్తంలో ఆస్తులను పోగు చేస్తుంటారు. అయితే బాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కువగా రెమ్యూనరేషన్ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇది ఒకప్పటి మాట.ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా నటీమణులు పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటూ అధిక మొత్తంలో ఆస్తులను పోగుచేస్తూ రిచెస్ట్ హీరోయిన్స్ గా పేరు సంపాదించారు. మరి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అధిక ఆస్తులను కలిగిన హీరోయిన్లు ఎవరు అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు ఎవరు అనే విషయానికి వస్తే..

లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని అగ్రతారగా కొనసాగుతున్న ఈమె ఒక్కో సినిమాకు ఏడు నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నయనతార నికర విలువ 200 కోట్ల వరకు పోగు చేసినట్టు సమాచారం. నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోయిన్స్ లో ముందు వరుసలో ఉంది.

అనంతరం తమన్నా రెండవ స్థానంలో ఉంది. ఈమె నిఖర విలువ సుమారు 150 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. వీరి తర్వాత నటి అనుష్క ఏకంగా 100 కోట్లకు పైగా నికర ఆస్తి విలువలను కలిగి ఉంది. వీరి తర్వాత స్థానం సమంత ఆక్రమించారు.సమంత కూడా 100 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టినట్టు తెలుస్తుంది.

సమంత తర్వాత పూజ హెగ్డే రష్మిక ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్నారు.అనుష్క మిగిలిన వారందరూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.కేవలం తెలుగు, తమిళ సినిమాలు మాత్రమే కాకుండా హిందీ సినిమాలలో, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus